విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడ‌లేదు.. కొంతమంది చేస్తున్న ప్రచారం అవాస్తవం: కేటీఆర్

By Sumanth KanukulaFirst Published Jul 2, 2022, 5:41 PM IST
Highlights

విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడిన‌ట్లు కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తాను ఓ కులాన్ని లేదా వర్గాన్ని తక్కువ చేసే కుసంస్కారిని కాదని చెప్పారు. 

విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడిన‌ట్లు కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తాను ఓ కులాన్ని లేదా వర్గాన్ని తక్కువ చేసే కుసంస్కారిని కాదని చెప్పారు. మొన్న జ‌రిగిన ఒక స‌మావేశంలో మాట్లాడిన సంద‌ర్భంగా.. విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌ను తాను కించ‌ప‌రిచిన‌ట్లు కొంత‌మంది చేస్తున్న ప్ర‌చారం అవాస్త‌వ‌మ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్షాలు కావాల‌నే రాద్ధాంతం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. కులాన్ని త‌క్కువ చేసి మాట్లాడే కుసంస్కారిని కాదని తేల్చిచెప్పారు. 

కేవలం ఓ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని ఉద్దేశించి అన్న మాట వలన ఎవరైనా బాధపడితే ఆ మాటని తాను ఉపసంహరించుకుంటున్నాన‌ని కేటీఆర్ చెప్పారు. 

ఇదిలా ఉంటే.. ఇటీవల కేటీఆర్ చేసిన కామెంట్స్ విశ్వ బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయని పలువురు విశ్వ బ్రాహ్మణులు ఆరోపించారు. ఈ మేరకు మీర్ పేట్ బీజేపీ కార్పొరేటర్ బిక్షపతి చారి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేటీఆర్ విశ్వబ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

click me!