Telangana: రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ ఆకస్మిక తనిఖీలు

Published : Apr 21, 2022, 05:18 PM IST
Telangana: రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ ఆకస్మిక తనిఖీలు

సారాంశం

Latest Telangana News: రాష్ట్రంలో మిస్సింగ్ రైస్ సమస్య ఎంతగా ఉందో తెలుసుకునేందుకు తెలంగాణలో మిగిలిపోయిన 2,430 ముడి రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఎఫ్‌సీఐ అధికారులను కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించింది.  

FCI: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారులు తెలంగాణలోని ముడి బియ్యం మిల్లులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని 40 రైస్‌ మిల్లుల్లో 4,53,896 బస్తాల బియ్యం మాయమయ్యాయని, దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. రాష్ట్రంలో మిస్సింగ్ రైస్ సమస్య ఎంతగా ఉందో తెలుసుకునేందుకు తెలంగాణలో మిగిలిపోయిన 2,430 ముడి రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఎఫ్‌సీఐ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రైస్ మిల్లులపై తనిఖీలు చేస్తున్నారు. 

అంత‌కుముందు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి బుధవారం మాట్లాడుతూ.. 2022 మార్చి 31న తెలంగాణలోని ర్యాండమ్ గా 40 మిల్లులపై ఎఫ్సీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారని, మిల్లుల నుంచి 4,53,896 బస్తాల బియ్యం క‌నిపించ‌కుండా పోయింద‌ని తెలిపారు. దీంతో  రైస్ మిల్లులను తనిఖీ చేయాలని ఆదేశించామన్నారు.  రైస్ మిల్లుల్లో ఉండాల్సిన బియ్యం ఎక్కడికి వెళ్లిందని ఆయన ప్రశ్నించారు.ఈ విషయమై ఆరా తీస్తామన్నారు.  రైస్ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాత్రమే ఒప్పందం ఉంటుందన్నారు. అయితే రైస్ మిల్లుల్లో బియ్యం ఎక్కడికి వెళ్లిందనే విషయమై అధికారులు ఆరా తీస్తారని కేంద్ర మంత్రి ప్రకటించారు. రైస్ మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొందో చెప్పాలని ఆయన కోరారు. తెలంగాణపై కఠిన చర్యలు తీసుకోవాలని, మాయమైన బియ్యం ఏమయ్యాయో కేంద్రానికి తెలియజేయాలని కోరారు. 

కాగా, ఎఫ్‌సీఐకి 40 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అంటే తెలంగాణకు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం అయితే కోటి మాత్రమే ఉన్నాయి. వర్షం వస్తే రైతులు తెచ్చిన వరిపంటను రక్షించేందుకు అవసరమైన పరికరాలు, టార్పాలిన్‌ షీట్లు, వరిలో తేమశాతం ఉందో లేదో చూసేందుకు కొలిచే పరికరాలు అందజేయడం లేదు' అని తెలిపారు. ఈ విషయమై గతంలోనే ఓ పార్టీ నేత సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ తనకు లేఖ రాశారని పరోక్షంగా టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి లేఖను కిషన్ రెడ్డి ప్రస్తావించారు.  ఈ ఏడాది మార్చి 31న కొన్ని రైస్ మిల్లుల్లో తనిఖీ చేసి బియ్యం బస్తాలు తక్కువగా ఉన్న విషయమై  రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామన్నారు. రైస్ మిల్లుల్లో బియ్యం తక్కుగా ఉన్న విషయమై చర్యలు తీసుకోవాలని లేఖ రాశామన్నారు. ఈ  విషయమై రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని కూడా కోరామన్నారు. రైస్ మిల్లులపై ఏం చర్యలు తీసుకొన్నారో చెప్పాలని కూడా కోరామన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!