ఈఎస్ఐ స్కాం: బయటకొస్తున్న దేవికారాణి లీలలు.. మరో రూ.2.47 కోట్లు సీజ్

By Siva KodatiFirst Published Sep 11, 2020, 7:23 PM IST
Highlights

తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో దేవికారాణి అవినీతి లీలలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శుక్రవారం ఏసీబీ రూ.2.47 కోట్లను సీజ్ చేసింది. బీనామీల పేరిట దేవికా రాణి పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసినట్లుగా అధికారులు గుర్తించారు

తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో దేవికారాణి అవినీతి లీలలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శుక్రవారం ఏసీబీ రూ.2.47 కోట్లను సీజ్ చేసింది. బీనామీల పేరిట దేవికా రాణి పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసినట్లుగా అధికారులు గుర్తించారు.

సైబరాబాద్‌లో కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలుకు ఆమె యత్నించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు గాను బినామీల ద్వారా డబ్బులు బదిలీ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ లావాదేవీలకు సంబంధించి రూ.1.29 కోట్లను దేవికారాణి బదిలీ చేశారు.

అలాగే రూ.35 లక్షలను బినామీల పేరిట.. దేవికా రాణి నేరుగా రూ.65 లక్షలు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో దేవికా రాణిపై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. అంతకుముందు నిందితుల ఆస్తులను ఏసీబీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు. ఆస్తుల జప్తుకు అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ఏసీబీ ఇటీవల లేఖ రాసింది.

Also Read:తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో మరో ట్విస్ట్: దేవికారాణి రూ. 10 కోట్ల బంగారు ఆభరణాలు మాయం

ఐఎంఎస్ జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మీలకు చెందిన ఆస్తుల జప్తుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పద్మ ఆమె కుటుంబసభ్యులు బినామీల పేరిట వున్న 8.5 కోట్ల ఆస్తులతో పాటు నాగలక్ష్మీకి చెందిన 2.7 కోట్ల ఆస్తులను జప్తు చేశారు అధికారులు. 

అంతకుముందు తెలంగాణ ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవీకారాణి అక్రమాస్తులపై ఏసీబీ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. అక్రమంగా సంపాదించిన డబ్బుతో దేవికారాణి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్టుగా ఏసీబబీ గుర్తించింది.

click me!