సాయి, దేవరాజ్ గొడవ: ఎవర్ని ప్రేమిస్తున్నావంటే శ్రావణి చెప్పింది ఇదీ....

Published : Sep 11, 2020, 07:17 PM IST
సాయి, దేవరాజ్ గొడవ: ఎవర్ని ప్రేమిస్తున్నావంటే శ్రావణి చెప్పింది ఇదీ....

సారాంశం

శ్రావణి ఆత్మహత్య కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. శ్రావణి కోసం సాయి, దేవరాజ్ ఫోన్ లో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఫోన్ శ్రావణికి కూడా కలిపి ఎవరిని ప్రేమిస్తున్నావని వారు అడిగారు.

హైదరాబాద్: టీవీ సీరియల్స్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. శ్రావణి విషయంలో సాయి, దేవరాజ్ గొడవ పడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు ముందు వారిద్దరు గొడవ పడ్డారు. శ్రావణి నాదంటే నాదని వారు ఫోన్ లో వాదించుకున్నారు.

నీ వల్లనే సమస్య వచ్చిందని దేవరాజ్ సాయితో అన్నాడు. మౌనంగా ఉన్న అమ్మాయిని రోడ్జెక్కేలా చేశావని అతను సాయిని దూషించాడు. ఐదేళ్లుగా తాను శ్రావణిని ప్రేమిస్తుంటే మధ్యలో నువ్వు వచ్చావని సాయి సాయి దేవరాజును ఉద్దేశించి అన్నారు. ఈ గొడవలో ఫోన్ శ్రావణికి కూడా కలిపి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావని అడిగినట్లు తెలుస్తోంది. తాను దేవరాజును ప్రేమిస్తున్నానని ఆ ఆడియో క్లిప్ ద్వారా వెలుగు చూసినట్లు టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి.

Also Read: తెగింపు రక్తంలోనే ఉంది: దేవరాజుపై టీవీ నటి శ్రావణి సీరియస్

అమ్మాయికి తాను కావాలని, అదే ఫైనల్ అని దేవరాజ్ సాయితో అన్నాడు. మధ్యలో నువ్వు డ్రామాలు ఆడవద్దని దేవరాజ్ చెప్పినట్లు కూడా సమాచారం. 

ఇదిలావుంటే, శ్రావణి ఆత్మహత్య కేసులో శ్రీకన్య హోటల్ నుంచి సేకరించిన వీడియో ఫుటేజీ కీలకం కానుంది. ఆత్మహత్యకు ముందు శ్రావణి దేవరాజ్ తో కలిసి శ్రీకన్య హోటల్ కు వెళ్లింది. ఆ సమయంలో అక్కడికి సాయి వచ్చాడని, శ్రావణిపై దాడి చేశాడని దేవరాజ్ చెబుతున్నాడు. సీసీటీవీ కెమెరాలో అది రికార్డయినట్లు తెలుస్తోంది.

Also Read: మిస్టరీగా మారిన శ్రావణి ఆత్మహత్య కేసు: దేవరాజుతో మాట్లాడిన వీడియో లీక్

కాగా, సాయిని ఎస్సార్ నగర్ పోలీసులు శనివారం విచారించే అవకాశం ఉంది. సాయిని దేవరాజ్ ను కలిపి వారు విచారిస్తారని అంటున్నారు. ఆర్ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డిని కూడా పోలీసుుల విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో శ్రావణి ఆత్మహత్య కేసులో రేపు కీలకం కానుంది.

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu