పూర్తి కేటాయింపులు అందడం లేదు: తుంగభద్ర బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ

By Siva Kodati  |  First Published Oct 5, 2021, 4:39 PM IST

తుంగభద్ర బోర్డు కార్యదర్శికి తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఇటీవల తుంగభద్ర నీటి విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ గురించి మురళీధర్ తన లేఖలో ప్రస్తావించారు. 


తుంగభద్ర బోర్డు కార్యదర్శికి తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఇటీవల తుంగభద్ర నీటి విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ గురించి మురళీధర్ తన లేఖలో ప్రస్తావించారు. తుంగభద్ర నీటి కేటాయింపుల్లో ఆర్‌డీఎస్‌కి రావాల్సిన 15.9 టీఎంసీ నీటిలో కేవలం 5, 6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని ఆయన వెల్లడించారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తుంగభద్ర నీటితోపాటు శ్రీశైలం నుంచి కూడా కృష్ణా నీటిని యథేచ్ఛగా తరలిస్తోందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు గతంలోనే 2 టీఎంసీల నీటిని విడుదల చేశారని, కానీ ఏపీ ప్రభుత్వం మరోసారి కేసీ కెనాల్‌ కోటా 2 టీఎంసీల నీటిని టీబీఆర్‌బీ హెచ్‌ఎల్‌సీకి విడుదల చేయాలని కోరిందని లేఖలో ప్రస్తావించారు. ఇది కృష్ణా నీటి వివాదం ట్రైబ్యునల్-1 అవార్డ్‌కు విరుద్ధమైన డిమాండ్‌ అని మురళీధర్ రావు తెలిపారు. 

Latest Videos

undefined

Also Read:జల జగడం: తెలంగాణ డీపీఆర్‌లు ఆమోదించొద్దని జీఆర్ఎంబీకి ఏపీ లేఖ

ఈ నీటిని విడుదల చేస్తే ఇప్పటికే నీటి లభ్యత తక్కువగా ఉన్న ఆర్‌డీఎస్‌కు మరింత అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆర్‌డీఎస్‌ ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తి చేసి, పూర్తి స్థాయిలో నీటిని అందించాలని తన లేఖలో తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్ సి. మురళీధర్ విజ్ఞప్తి చేశారు
 

click me!