కేరళకు విద్యుత్ ఉద్యోగుల ఆర్థిక సహాయం 9కోట్లు....

By sivanagaprasad KodatiFirst Published Aug 21, 2018, 5:54 PM IST
Highlights

కేరళ వరద బాధితుల సహాయార్ధం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు. సచివాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనం 9కోట్ల రూపాయలను సీఎండీ ప్రభాకర్ నేతృత్వంలో మంత్రి జగదీష్ రెడ్డి కి అంద జేశారు. 

హైదరాబాద్:  కేరళ వరద బాధితుల సహాయార్ధం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు. సచివాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనం 9కోట్ల రూపాయలను సీఎండీ ప్రభాకర్ నేతృత్వంలో మంత్రి జగదీష్ రెడ్డి కి అంద జేశారు. 


ప్రకృతి బీభత్సంతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైన నేపథ్యంలో దేశం అంతా కేరళ కి అండగా ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 కోట్ల రూపాయలతో పాటు బియ్యం అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు. వారికి మనోధైర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 

దేశంలో ఎవరికి ఇబ్బంది, కష్టాలు వచ్చిన ఆదుకునే వారు ఉన్నారనే ధైర్యం వారిలో కల్పించాలని సూచించారు. కేరళ ప్రజలు వెంట మేము ఉన్నామని వారు భయపడే పని లేదని మంత్రి జగదీష్ తెలిపారు. కేరళ కి విద్యుత్ స్థంబాలు, కరెంటు మీటర్లు, ఇతర విద్యుత్ పరికరాలు కూడా పంపుతున్నామ స్పష్టం చేశారు. 

click me!