సమ్మె విరమించిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు..

By Mahesh Rajamoni  |  First Published Apr 27, 2023, 5:42 PM IST

Hyderabad: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించారు. ఇదే క్ర‌మంలో తొల‌గించిన  200 మంది సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాల‌ని కోరారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే బలాల తెలిపారు.
 


power utility employees call off strike: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించారు. ఇదే క్ర‌మంలో తొల‌గించిన  200 మంది సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాల‌ని కోరారు. ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే బలాల తెలిపారు. వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ విద్యుత్ సంస్థ యాజమాన్యం 200 మంది ఆర్టిజన్లను విధుల నుంచి తొలగించింది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్, ఇత్తెహాద్ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అనుబంధ ఉద్యోగులు సమ్మె విరమించారు. 

మంగళవారం 20 శాతం మంది విధులకు గైర్హాజరైనప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్ మిషన్, పంపిణీపై సమ్మె ప్రభావం లేదని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఎంఐఎం మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కో చైర్మన్ డి.ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ చైర్మన్ జి.రఘుమారెడ్డి చర్చించిన సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. సమ్మెను బేషరతుగా విరమించేందుకు అంగీకరించామనీ, ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరతారని ఇత్తెహాద్ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ కు నేతృత్వం వహిస్తున్న నాయ‌కులు తెలిపారు. ఆర్టిజన్ల డిమాండ్లను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు విద్యుత్ యాజమాన్యం అంగీకరించిందని బలాల తెలిపారు.

Latest Videos

మంగళవారం విధుల నుంచి తొలగించిన 200 మంది ఆర్టిజన్లను తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించేందుకు ఆ శాఖ అధికారులు అంగీకరించడంతో వారు సమ్మె విరమించారని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే బలాల తెలిపారు. 

ఉద్యోగుల నిరసనకు కారణం ఏమిటంటే..? 

మార్చి 24న విద్యుత్ సౌధ వద్ద జరిగిన తొలి భారీ ధర్నాలో సుమారు 30 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే వివిధ డిమాండ్లపై ఒక రౌండ్ చర్చలకు యాజమాన్యం యూనియన్లను ఆహ్వానించింది. అయితే సమావేశం ముగిసే సమయానికి విద్యుత్ ఉద్యోగుల జీతాల్లో ఆరు శాతం పెంపును ఆఫర్ చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయానికి యాజమాన్యం కట్టుబడి ఉంది. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి పెండింగ్ లో ఉన్న వేతన సవరణ సంఘంపై యాజమాన్యం వైఖరితో ఉద్యోగులు నిరాశ చెందారని జేఏసీ నేతలు తెలిపారు. విద్యుత్ సంస్థల్లోని ఆర్టిజన్ల ఆరు డిమాండ్లకు మద్దతుగా తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్, ఇత్తెహాద్ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ నెల 24వ తేదీ మంగళవారం నుంచి సమ్మెకు దిగాలని నోటీసు ఇచ్చాయి.

click me!