తెలంగాణ విద్యుత్ శాఖలో సమ్మె సైరన్.. 25 నుంచి ఆర్టిజన్ల స్ట్రైక్

Siva Kodati |  
Published : Apr 23, 2023, 03:43 PM IST
తెలంగాణ విద్యుత్ శాఖలో సమ్మె సైరన్.. 25 నుంచి ఆర్టిజన్ల స్ట్రైక్

సారాంశం

తెలంగాణ విద్యుత్ శాఖలో సమ్మె సైరన్ మోగింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు

తెలంగాణ విద్యుత్ శాఖలో సమ్మె సైరన్ మోగింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. ఈ సమ్మె విషయంలో కార్మికుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని యూనియన్లు సమ్మెకు మద్ధతుగా వుంటే.. మరికొన్ని సంఘాలు మాత్రం దూరంగా వుంటున్నాయి. శనివారం తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సాయిలను ఎస్మా  కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

సమ్మెకు పిలుపునిచ్చినందుకే తమ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. తమ రూ.12,600 బేసిక్‌పై 7 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి.. హెచ్ఆర్ఏలో 6 శాతం కోత విధించడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌‌లో ఐడీ నెంబర్ కలిగిన వారందరీని ఆర్టిజన్లుగా గుర్తించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కొత్త రిక్రూట్ అయిన ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ అమలు చేయాలని కోరారు. అలాగే ఆర్టిజన్ కార్మికులకు స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

PREV
click me!

Recommended Stories

100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం
Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?