మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రారంభం.. తొలి ఫలితం అక్కడ్నుంచే.. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఓ క్లారిటీ.. 

By Rajesh KarampooriFirst Published Dec 3, 2023, 12:55 AM IST
Highlights

Telangana Elections result | అంతటా ఉత్కంఠ కలిగిస్తున్న తెలంగాణ కౌంటింగ్ ఆదివారం జరగనుంది. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం పది గంటలకే ఫస్ట్ రౌండ్ ఫలితాలు రాబోతున్నాయ్. ఇప్పటికే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే విజయమని చెబుతుండగా.. ఎగ్జాక్ట్ పోల్స్ తమకు శుభవార్త ఇస్తాయని బీఆర్ఎస్ ధీమాతో ఉంది.  

Telangana Elections result | తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే విజయమని, తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది కాంగ్రెస్సేననీ ఎగ్జిట్ పోల్స్ చెబుతుండగా.. ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రమే తమకే అనుకూలంగా ఉన్నాయనీ, హాట్రిక్ విజయం సాధించి, తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని గులాబీ శ్రేణులు ధీమాతో ఉన్నారు.  మరికొన్ని గంటల్లో కౌంటింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాటు చేసింది.  

49 కేంద్రాల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలి అర గంటలో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడుతాయి. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను కౌంట్ చేస్తారు. కాగా, ఉదయం పది గంటల వరకూ.. తొలి  రౌండ్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల కల్లా చార్మినార్ సెగ్మెంట్ ఫలితం వెలువడనున్నట్టు అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో మధ్యాహ్నం ఒంటి గంటకల్లా రాష్ట్రంలోని అన్ని స్థానాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలైన ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉంది.

గత నెల 30 న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,26,02,793 ఓట్లకు గానూ.. 2,32,59,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బరిలో నిలిచిన 2290 మంది  అభ్యర్థుల భవిత్వం తేలనున్నది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసింది. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సిగ్మెంట్ కు 14 రౌండ్ల మేర లెక్కింపు జరుగనున్నది.  

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఈసారి 1.80 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. తొలి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది. ఉదయం 9 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడతాయి. ఆ తరువాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల కల్లా చార్మినార్ సెగ్మెంట్ ఫలితం వెలువడనున్నట్టు అధికారులు భావిస్తున్నారు.

అదే సమయంలో మధ్యాహ్నం ఒంటి గంటకల్లా రాష్ట్రంలోని అన్ని స్థానాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలైన ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉంది. కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, పఠాన్ చెరు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు 400కు పైగా ఉండటంతో ఇక్కడ మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటు చేశారు.  ఇక.. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500కుపైగా పోలింగ్ కేంద్రాలుండటంతో 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఈవీఎంను నిక్షిప్తంగా మూడుసార్లు లెక్కిస్తారు. అంటే.. ఈ నియోజక వర్గాలకు చెందిన ఫలితాలు మధ్యాహ్నం 1 గంటల వరకు వెలుబడనున్నాయి. 

ఇక  నవంబర్ 30న ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో భద్రతపర్చారు. ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. 40 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నాయి. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. పలు ఆంక్షలు కూడా విధించారు. ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులు నిషేధించారు. అదే సమయంలో మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మూతపడనున్నాయి.

click me!