KTR: "వేడుకలకు సిద్ధంగా ఉండండి.." మంత్రి కేటీఆర్‌ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌..

By Rajesh Karampoori  |  First Published Dec 2, 2023, 11:30 PM IST

KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల  ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. డిసెంబర్ 3వ తేదీన మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కు మద్ధతుగా ఫలితాలు ఉండడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్  ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

Minister KTR Confident On Victor KTR Tweet viral KRJ

KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంట్ డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితష్యం తేలనున్నది. ఈ క్రమంలో అందరు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తాము గెలుస్తామంటే.. తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. ఎగ్జిట్ పోల్స్‌లను తలకిందులు చేస్తూ ఫలితాల్లో కారు దూసుకెళ్తోందని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ తెలంగాణ ప్రజానీకం తీర్పు మాత్రం ఈ సారి ఊహకు అందని రీతిలో ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్‌ మరోసారి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. గన్ గురి పెడుతున్నట్లు ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘హ్యాట్రిక్‌ లోడింగ్‌ 3.0. వేడుకలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో  కార్యకర్తల్లో, నాయకుల్లో  ఎక్కడ లేని జోష్‌ వచ్చింది. కార్యకర్తలు కూడా గెలుపుపై దీమా వ్యక్తం చేశారు. 

Latest Videos

అంతకు ముందు మంత్రి కేటీఆర్‌ ఎగ్జిట్ పోల్స్‌ విడుదల తర్వాత ఆసక్తిర ట్వీట్ చేశారు. “చాలా కాలం తర్వాత తాను రాత్రి కంటి నిండా నిద్రపోయాను. ఎగ్జిట్ పోల్స్ పెరగొచ్చు.. తగ్గొచు.. కానీ, ఎగ్జాట్ పోల్స్ మాత్రం తమకు శుభవార్తను చెబుతాయి” అంటూ ‘X'(ట్విటర్)లో పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు ఫలితాలు వెలుడుతాయో..? అధికార బీఆర్‌ఎస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకుంటుందో? లేదో ? తెలియాలంటే  మాత్రం మరికొన్ని గంటలు కచ్చితంగా వేచి చూడాల్సిందే..  

vuukle one pixel image
click me!
vuukle one pixel image vuukle one pixel image