Telangana Elections result : తెలంగాణ ఎన్నికల్లో యువ ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఏ పార్టీకి అధిక సీట్లు రావాలన్నా.. అధికారం చేపట్టాలన్నా.. పార్టీల గెలుపోటములను వారే నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది. తాజా ఎలక్టోరల్ రోల్ డేటా ప్రకారం.. ఈసారి 9 లక్షల మంది యువత తొలిసారి ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వారందరూ ఏటు మొగ్గు చూపారో వేచి చూడాలి.
Telangana Elections Result : తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ షురూ కానున్నది. ఇప్పటికే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు జై కొడుతున్నాయి. తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది కాంగ్రెస్సేననీ ఎగ్జిట్ పోల్స్ చెబుతుండగా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ.. ఎగ్జాక్ట్ విజయాన్నిసాధిస్తామని, తెలంగాణ ప్రజానీకం తమకే సపోర్టుగా ఉందనీ, హాట్రిక్ విజయం సాధించి, తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సారి ఓ పార్టీ గెలుపు ఓటముల్లో యువ ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఏ పార్టీకి అధిక సీట్లు రావాలనే.. ఏ పార్టీ అధికారం చేపట్టాలనేది కూడా డిసైట్ చేసేది యువతనేనని తెలుస్తోంది. తాజా ఎలక్టోరల్ రోల్ డేటా ప్రకారం.. ఈసారి 9 లక్షల మంది యువత తొలిసారి ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. రాష్ట్రం మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 1,63,13,268 మంది పురుషులు, కాగా.. 1,63,02,261మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో 18-19 ఏళ్లు ఉన్న ఓటర్లు 9,99,667 మంది ఉన్నారు. వీరందరూ తొలిసారి ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అలాగే.. 19-35 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్లు 75 లక్షల మంది ఉన్నట్లు తేలింది.
దీంతో ప్రధాన పార్టీలు యువత, మహిళలను టార్గెట్ చేస్తూ.. హామీలు గుప్పించాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం.. సినీ ప్రముఖులు, ప్రచార కర్తల అవగాహన కార్యక్రమాలు చేపట్టి యువతను పోలింగ్ స్టేషన్లకు తీసుకెళ్లేలా చేశాయని పలువురు భావిస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగ కల్పన, జాబ్ నోటిఫికేషన్ల ప్రభావం కూడా యువతపై ఉంటుంది. తెలంగాణలో ఐటీ, ప్రయివేటు సంస్థల ఏర్పాటుకు, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం దోహదం చేసిందనీ, హైదరాబాద్ అభివృద్ధి పార్టీతోనే సాధ్యమైందని బీఆర్ఎస్ ప్రధానంగా ప్రచారం చేసింది.
ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో కొత్తగా నమోదైన యువ ఓట్లర్లలో 80 శాతం మంది ఈసారి ఓటు హక్కు వినియోగించు కున్నట్టు తెలుస్తోంది . అలాగే.. శివారు నియోజకవర్గాల్లో 70 శాతం మంది యువత తన ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు విశ్లేషించారు. ఇలా యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములు వారిపైనే ఆధారపడ్డాయి. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు యువతను ఆకర్షించేలా విశ్వప్రయత్నాలు చేశారు. యువ ఓటర్లతో మాట్లాడేందుకు నాయకులను ఆసక్తి చూపారు. ఇలా పార్టీలన్నీ యువతను టార్గెట్ చేశారు. వారి యువత ఎటువైపు మొగ్గు చూపిందో వేచి చూడాలి మరి..