Raghunandan Rao: నాడు వకీల్ సాబ్.. నేడు ఎమ్మెల్యే.. రఘునందన్ రావు రాజకీయ ప్రస్థానం ఇదే..

By Rajesh KarampooriFirst Published Dec 3, 2023, 5:11 AM IST
Highlights

Raghunandan Rao: చిన్నతనం నుంచి రాజకీయాలపై అవగాహన ఉన్న రఘునందన్​ రావు  డిగ్రీ వరకూ సిద్దిపేటలో చదివారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్​ఎల్​బీ పట్టా పొందారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా చేరారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు. నేడు బీజేపీ ఎమ్మెల్యేగా.. పార్టీలో కీలక నేతగా మారారు. ఈ క్రమంలో ఆయన రాజకీయ ప్రస్థానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 

Raghunandan Rao: మాటలలో చతురత, కార్య శీలతలో దక్షత, విమర్శలలో వైవిధ్యత ఇవన్నీ ఆయనను రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలిపాయి. ఊకదంపుడు ఉపన్యాసాలు.. వివాదాస్ప వ్యాఖ్యలు చేయడం కాదు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కాదు. ఆయన మాట్లాడిన అందులో సమగ్ర వివరణ, విశ్లేషణ ఉంటుంది.  ఓ వేళ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తే.. ఆధారాలు లేని ఆరోపణలు అసలే చేయదు. విమర్శలను సైతం వివరణాత్మకంగా చేసే నాయకుడు. ఆయనే దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘనందన్ రావు. 

రఘునందన్ రావు తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం వ్యక్తి.. అనునిత్యం తన పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉంటాడనే పేరు ఆయన సొంతం. ఆయన ప్రదర్శించి మొండి ధైర్యం, పట్టుదలనే బీఆర్ఎస్ కంచుకోట దుబ్బాకలో బీజేపీ విజయం సాధించేలా చేసింది. రెండుసార్లు ఓటమి పాలైనా తన పోరాటం ఏ రోజు కూడా ఆపలేదు. పడినా ప్రతి సారి అంతకంటే.. వేగంగా ముందుకు సాగాడు. చివరకు మూడోసారి విజయం సాధించి.. దుబ్బాక పీఠాన్ని కైవసం చేసుకున్నారు రఘునందన్ రావు. 

రఘునందన్ రావు .. మార్చి 23,1968లో సిద్ధిపేటలో జన్మించారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్,ఎల్ఎల బీ, బీఎడ్, హ్యూమన్ రైట్స్ తో పీజీ డిప్లమా పూర్తి చేశారు. డిగ్రీ పట్టా పొందిన అనంతరం 1991లో పటాన్ చెరు ప్రాంతానికి నివాసం మార్చారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్​ఎల్​బీ పట్టా పొందిన రఘునందన్ రావు.. కెరీర్ మొదట్లో ఓ ప్రముఖ తెలుగు దినపత్రికకు ఐదేళ్ల పాటు న్యూస్ రిపోర్టర్ గా పని చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా చేరి న్యాయ సేవలందించారు. 2013లో అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్ కేసును చేపట్టడంతో ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా తెలిసింది. నిజంగా అప్పుడు అదోక పెద్ద సెన్సేషన్. వృత్తి ధర్మం వేరు.. రాజకీయం వేరు అని అప్పట్లో పలు మార్లు వివరణ ఇవ్వాల్సి వచ్చింది.  

రఘునందన్ రావుకు చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి. వకీల్ సాబ్ గా చాలా బిజీబిజీగా ఉన్నా..  2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ(ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరి ఓ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.  ఆ తరువాత పొలిట్‌బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఎదిగారు. గులాబీ బాస్ కేసీఆర్ నాయకత్వాన్ని ముందుకు తీసుకపోవడం కీలకంగా వ్యవహరించారు. ఆ పార్టీకి కీ లీడర్ గా మారారు. అసలేం జరిగిందో తెలియదు. కానీ.. 2013లో టీఆర్ఎస్ పార్టీ రఘునందన్ రావును సస్పెండ్ చేసింది. 

రెండుసార్ల ఓటమి.. ఆ తర్వాత ఊహించని ఫలితం..

టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తరువాత రఘునందన్ రావు బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బరిలో నిలిచాడు. కానీ.. ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2020లో దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసి.. అప్పటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి సోలిపేట సుజాతపై 1,074 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఆయన విజయం అధికార బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బగా మారింది. మరో ఈ విజయం తెలంగాణలో బీజేపీకి పెద్ద బూస్ట్ ఇచ్చింది..

పోలింగ్ రోజు ఓటు వేసిన అనంతరం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్న ఆయన.. వివేకంతో ఆలోచన చేసే తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఓటేస్తారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రఘునందన్.


 

click me!