telangana elections Polling 2023 : జనగామలో పోలింగ్ బూతు దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ తోపులాట, ఉద్రిక్తత..

By SumaBala Bukka  |  First Published Nov 30, 2023, 9:43 AM IST

జనగామలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. 


జనగామ : తెలంగాణ ఎన్నికల వేళ జనగామలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. జనగామ రైల్వే స్టేషన్ సమీపంలోని పోలింగ్ బూతు దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థఇ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువసేపు పోలింగ్ బూత్ దగ్గరే ఉంటున్నారని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాగ్వాదంగా మొదలై.. ఘర్షణకు దారి తీసింది. 

మొదట జనగామ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యమవుతుందని అది కనుక్కోవడానికి అక్కడికి వెళ్లినట్టుగా బీఆర్ఎస్ వాళ్లు చెబుతున్నారు. అయితే, ఈ క్రమంలో పార్టీ కండువాలు కప్పుకుని వస్తున్నారని, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని.. ఎక్కువ సమయం బూత్ లలో ఉంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. ఇది ఘర్షణకు దారితీసింది. 

Latest Videos

ఘర్షణ నేపథ్యంలో పోలీసులు కలగచేసుకున్నారు. ఇరు వర్గాలను కేంద్రాల దగ్గరినుంచి బైటికి పంపారు. గొడవ సద్దుమణికి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 
 

click me!