గద్వాలలో కర్ణాటక రైతుల ప్రచారం..ఎవ్వరికి మద్దతు ఇస్తురంటే?

By Rajesh Karampoori  |  First Published Oct 25, 2023, 4:31 AM IST

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో కర్ణాటక రైతులు గద్వాలలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంతకీ వారు ఏ పార్టీకి అనుగుణంగా ప్రచారం నిర్వహిస్తున్నారంటే..?  


తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచార పర్వన్ని ప్రారంభించాయి. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి.. ఓటర్ దేవుళ్లలను ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమను నమ్మాలని.. తమకే ఓటెయ్యాలంటూ.. భారీ హామీలిస్తున్నారు అభ్యర్థులు, సదరు పార్టీ కార్యకర్తలు. మరోవైపు ఆ పార్టీల బడా నేతలు భారీ బహిరంగ సభలను  ఏర్పాటు చేసి.. ఊకదంపుడు ఉపన్యాసాలను  ఇస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. ఇలా ప్రచారం రోజురోజుకు జోరుగా సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. కర్ణాటక రైతులు కూడా తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. వారి ఏదైనా పార్టీకి మద్దతిస్తున్నారని భావిస్తే.. అది పొరపాటే. ప్రధానంగా కాంగ్రెస్ ని నమ్మి మోసపోకండంటూ.. ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఘటన గద్వాలలో జరిగింది. ఈ రైతుల ప్రచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కాంగ్రెస్‌ పార్టీని నమ్మి తమలా మోసపోవద్దంటూ.. కర్ణాటక రైతులు గద్వాలలో ప్రచారం చేపట్టారు. "కరెంటు లేక మా పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్‌ చేతిలో మేం మోసపోయాం. మీరు మోసపోకండి." అంటూ తెలుగులో రాసిన ఫ్లకార్డులు , బ్యానర్లు పట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ను నమ్మి అధికారం పగ్గాలను ఇస్తే.. ఆగం అవుతారని.. ఆ పార్టీని నమ్మి మోసపోవద్దని ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.   

Latest Videos

సీఎం కేసీఆర్ కోసం యూపీ రైతు ప్రచారం 

మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం రైతుల లబ్ది కోసం చేపడుతున్న రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ఆకర్షితుడైన ఉత్తరప్రదేశ్‌లో బల్లియాకు చెందిన రైతు హక్కుల కార్యకర్త రాఘవేంద్ర కుమార్ బీఆర్ఎస్ కు అనుగుణంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  హైదరాబాద్ చేరుకుని నగరంలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ స్థానికులతో సమావేశమయ్యారు.

 కేసీఆర్ వరుసగా మూడో సారి సీఎం కావాలంటూ.. బీఆర్ఎస్ కు అనుగుణంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.తెలంగాణలో ప్రచారం చేసేందుకు ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నుంచి వచ్చారు . అతను స్థానికులతో  చిన్న సమూహాలతో సమావేశాలు నిర్వహిస్తాడు. తెలంగాణ ప్రభుత్వం యొక్క రైతు బంధు, రైతు భీమా, ఇతర రైతు అనుకూల చర్యల గురించి వారికి వివరిస్తాడు .

గత వారం రోజుల నుంచి ఇదే తన దినచర్యగా మారిన ఆయన ఒక నెల పాటు తన ప్రచారాన్ని కొనసాగించనున్నారు. రాఘవేంద్రకుమార్‌ గత ఆగస్టులో నగరంలో జరిగిన అఖిల భారత రైతు సమావేశంలో ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో స్ఫూర్తి పొంది , అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వ విధానాలను రైతుల్లో ప్రచారం చేస్తున్నానని తెలిపారు.  

click me!