Telangana Election Counting:వైరాలో కాంగ్రెస్ కు పట్టం కట్టిన ఓటర్లు, మెజారిటీ ఎంతంటే..?

By Mahesh Jujjuri  |  First Published Dec 3, 2023, 4:43 PM IST

తెలంగాణ రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి గట్టిగా వీచింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మినహా అన్ని సీట్లు కాంగ్రెస్ టీమ్ స్వీప్ చేసింది. ఈక్రమంలో వైరా సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. 


తెలంగాణ రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి గట్టిగా వీచింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మినహా అన్ని సీట్లు కాంగ్రెస్ టీమ్ స్వీప్ చేసింది. ఈక్రమంలో వైరా సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. 

తెలంగాణాలో కాంట్రెస్ గెలుపు లాంచనం అయ్యింది. ప్రభుత్వం ఏర్పాటుకు తగినంత మెజారిటీ కూడా వచ్చింది. ఖమ్మంలో కాంగ్రెస్ అనుకున్నది సాధించింది. అందులో భాగంగా వైరాలో కూడా బీఆర్ఎస్ అభ్యర్ధిపై కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచి చూపించారు. ఎస్టీ రిజర్డ్ స్థానం అయిన .. వైరాలో బీఆర్ఎస్ నుంచి మదన్ లాల్ పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి రామ్ దాస్ పోటీ చేశారు. వీరిమధ్య పోటీ..హోరా హోరీగా నడిచింది. ప్రతీ రౌడ్ కు పరిస్థితులు మారుతూ వచ్చాయి. చివరకు మదన్ లాల్ పై 2 వేల పై చిలుకు  మెజారిటీతో రామ్ దాస్ వైరా ఎమ్మెల్యేగా గెలిచారు. 

Latest Videos

undefined

ఎస్టీ రిజర్వ్ స్థానం అయిన వైరాలో గతంలో కమ్యూనిష్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వైరా నీయోజకవర్గం ఏర్పడినప్పుడు కూడా రెండు మార్లు కమ్యునిస్ట్ లు ఎమ్మెల్యేలుగా చేశారు. కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి ప్రతినిథ్యం వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండుసార్లు గులాబీ ఎమ్మెల్యేనే అక్కడ గెలిచారు. ఇకతాజాగా వైరా కాంగ్రెస్ చేతిలోకి వెళ్లింది. 

కాగా రాష్ట్రంలో మొదటి నుంచి అనుకున్న విధంగా కాంగ్రెస్ గాలి గట్టిగా వీచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ టీమ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ప్రగతీ భవన్ ఇక ప్రజా భవన్ అని చెప్పారు. అటు బీఆర్ఎస్ కూడా తమ ఓటమిని ఓప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెపుతూ.. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్  చేశారు. 

లైవ్ అప్ డేట్స్

click me!