ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో గజ్వేల్ ఒకటి.
గజ్వేల్ : ఈ సారి ఎన్నికల్లో చర్చల్లో ఉన్న ప్రముఖ నియోజకవర్గం గజ్వేల్. ఇది ఇంతకు ముందు మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో ఉంది. గజ్వేల్ లో
గజ్వేల్, తూప్రాన్, కొండపాక, వర్గల్, మూలుగు, జగదేవ్ పేరు మండలాలు ఈ నియోజక వర్గం కింద ఉన్నాయి. 2014 నుంచి సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి గజ్వేల్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీలో ఉన్నారు. మూడు రౌండ్లు గడిచేసరికి ఈ నియోజకవర్గంలో కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు.
గజ్వేల్ లో బరిలో మొత్తం 48మంది అభ్యర్థులు ఉండడంతో దీని ఫలితాలు రాత్రి వరకు క్లారిటీ వస్తుందని సమాచారం.