అత్తా అల్లుడి అక్రమ బంధం... బెడ్రూంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి చివరకు

Arun Kumar P   | Asianet News
Published : Aug 25, 2021, 11:08 AM IST
అత్తా అల్లుడి అక్రమ బంధం... బెడ్రూంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి చివరకు

సారాంశం

అక్రమ సంబంధం కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. బెడ్రూంలో  రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ అత్తా అల్లుడు అదే గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న దారుణం సిద్దిపేట జిల్లాలో జరిగింది. 

సిద్దిపేట: వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. వావివరసలు మరిచి అత్తా అల్లుడు అక్రమ సంబంధాన్ని సాగిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దీంతో పరువు పోతుందని భావించిన ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దుర్ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి  చెందిన శివ(27), శిరీష(25) దంపతులు. పెళ్లయిన నాటినుండి వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా వుండేవారు. ఎలాంటి కలతలు లేకుండా సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో భార్య అక్రమసంబంధంతో చిచ్చురేగింది. 

ఇంటిపక్కనే నివాసముండే వరసకు అల్లుడయ్యే శ్రీకాంత్(24) అనే యువకుడితో శిరీష సన్నిహితంగా వుండేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త బయటకు వెళ్లిన సమయంలో శ్రీకాంత్ ను ఇంటికి పిలుచుకునేది. వీరి అక్రమసంబంధం గురించి కుటుంబసభ్యులకు తెలిసి ఇరువురినీ గట్టిగా హెచ్చరించారు. అయినాకూడా వీరి తీరులో మార్పు రాలేదు.  

read more  పెళ్లయిన అమ్మాయి వెంటపడి వేధిస్తూ... దారుణానికి ఒడిగట్టిన సైకో

సోమవారం పనిపై బయటకు వెళ్లిన శివ రాత్రి ఇంటికి రావడంలేదని భార్యకు సమాచారమిచ్చాడు. ఇదే అదునుగా భావించిన శిరీష్ రాత్రికి తన ప్రియుడు శ్రీకాంత్ ను ఇంటికి పిలుచుకుంది. వీరిద్దరు బెడ్రూంలో వుండటాన్ని గమనించిన శివ తల్లి ఆ గదికి బయటనుండి గడియపెట్టింది. ఇరుగుపొరుగు వారిని పిలిచి కోడలి అక్రమ సబంధం గురించి తెలిపింది. కొడుకు వచ్చేవరకు వారిని అదే గదిలో బంధించింది. 

అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన శిరీష, శ్రీకాంత్ బయటకు వస్తే పరువు పోతుందని భావించి దారుణ నిర్ణయం తీసుకున్నారు. అదే గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నారు. ఉదయం గది తలుపులు తెరవగా ఇద్దరు విగతజీవులుగా కనిపించారు. 

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి  తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?