తెలంగాణలో ప్రారంభమైన ఎంసెట్: ఆ విద్యార్థులకు టైం రీ షెడ్యూల్

By narsimha lodeFirst Published Aug 4, 2021, 10:02 AM IST
Highlights


 తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుండి ఈ నెల 10వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడ పరీక్షా కేంద్రంలోకి విద్యార్ధులను అనుమతించరు.

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుండి10వ తేదీ వరకు ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం పూట ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.ఇవాళ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాఁహ్నం 3 గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు రెండు విడతలుగా పరీక్షలను నిర్వహించనున్నారు.

ఈ నెల 4,5,6 తేదీల్లో ఇంజనీరింగ్, ఈ నెల 9,10 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్  పరీక్షలు నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు.  పరీక్షా కేంద్రంలోకి అడుగుపెట్టే సఃమయంలో విద్యార్థులు సెల్ప్ డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను పెట్టింంది ప్రభుత్వం.ఎంసెట్ పరీక్షలకు ధరఖాస్తు చేసుకొన్న తర్వాత కోవిడ్ బారిన పడి పరీక్షలు రాయలేని విద్యార్థులకు  తర్వాత పరీక్షలను నిర్వహించనున్నట్టుగా ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.

also read:ఎల్లుండి నుండే తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు: ఇవి తప్పనిసరి

బిట్‌శాట్ పరీక్ష రాస్తున్న 1500 మంది విద్యార్థులకు ఎంసెట్ పరీక్ష సమయాన్ని రీ షెడ్యూల్ చేశారు.  ఈ ప,రీక్షలను కోవిడ్ ప్రోటోకాల్స్ ఆధారంగా నిర్వహించనున్నారు.ఎంసెట్ ప్రవేశ పరీక్షల కోసం ఏపీ, తెలంగాణల్లో  105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 82 పరీక్షా కేంద్రాలు, ఏపీలో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.  హైద్రాబాద్ జేఎన్‌టీయూ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.ఎంసెట్ ప్రవేశ పరీక్షల కోసం 2,51,606 మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకొన్నారు. ఇవాళ జరిగే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు 1,64,962 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.


 

click me!