జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు

Siva Kodati |  
Published : Aug 03, 2021, 09:51 PM IST
జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు

సారాంశం

ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్‌ మల్లన్న కార్యాలయంలో సైబర్‌ క్రైం పోలీసులు తనిఖీలు చేయడం కలకలం రేపుతోంది. మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలోని మల్లన్న కార్యాలయంలో మంగళవారం సైబర్‌ క్రైం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్‌ మల్లన్న కార్యాలయంలో సైబర్‌ క్రైం పోలీసులు తనిఖీలు చేయడం కలకలం రేపుతోంది. మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలోని మల్లన్న కార్యాలయంలో మంగళవారం సైబర్‌ క్రైం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే తనిఖీలు ఎందుకు చేస్తున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. 

కాగా, ఆగస్టు 29న జోగులాంబ గద్వాల్‌ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తీన్మార్‌ మల్లన్న వెల్లడించారు. పాదయాత్రకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు. తమ పార్టీలో చేరాలంటూ ఇప్పటికే కొందరు నేతలు ఆహ్వానించారని మల్లన్న తెలిపారు. తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు ఎక్కడ ఉందో చెప్పాలని మల్లన్న డిమాండ్‌ చేశారు. 

Also Read:పల్లాకు చెమటలు పట్టించిన ఎవరీ తీన్మార్ మల్లన్న?

ఇటీవల జరిగిన నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్ మార్ మల్లన్న హోరాహోరీగా పోరాడి ఏకంగా టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెమటలు పట్టించాడు. మల్లన్న ఓటమి చెందినప్పటికీ...  ఒక స్వతంత్ర అభ్యర్థి ఈ స్థాయిలో ఎలా ఓట్లు సాధించాడన్న చర్చ నడిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ వి6 లో ఉద్యోగానికి  రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడ్డాక నల్గొండ - ఖమ్మం - వరంగల్ స్థానినికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇక ఆ తరువాత మరల 10 టీవీ లో ఇదే తరహా కార్యక్రమాన్ని హోస్ట్ చేసాడు. 
 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే