
తెలంగాణలోని వివిధ కాలేజీల్లో ఉన్న ఇంజనీరింగ్, మెడిసన్, అగ్రికల్చర్ కోర్సుల్లో చేరేందుకు గాను నిర్వహించిన ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు.
మొత్తం లక్షా 30 వేల మంది ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసిలో 68 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ వెయిటేజ్ కారణంగా ఫలితాలను ఆలస్యమయ్యాయని ఎంసెట్ కన్వీనర్ యాదయ్య తెలిపారు. ఇంజనీరింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెంకు చెందిన రవిశ్రీతేజ మొదటి ర్యాంక్ సాధించాడు.
ఇంజనీరింగ్‌లో టాప్ టెన్ ర్యాంకర్లు:
1. కురిసెటి రవిశ్రీ తేజ... వెస్ట్ గోదావరి( ఏపీ)
2.చంద్రశేఖర్ ...హైదరాబాద్
3.గిల్లెల ఆకాష్ రెడ్డి... రంగారెడ్డి
4 .భట్టె పాటి కార్తికేయ... రంగారెడ్డి
5 .బానుదత్త...వెస్ట్ గోదావరి(ఏపీ)
6.సాయి వంశీ...రంగారెడ్డి
7.సాయి విజ్ఞ...రంగారెడ్డి
8.జితేంద్ర కశ్యప్.. ప్రకారం(ఏపీ)
9.వేద ప్రణవ్..రంగారెడ్డి
10.అబిజిత్ రెడ్డి.. రంగారెడ్డి
మెడిసిన్ టాప్ టెన్ ర్యాంకర్లు:
1. ఎంపటి కుశ్వంత్
2. దాసరి కిరణ్
3. అరుణ్ తేజ
4. సాయి స్వాతి
5. అక్షయ్
6. మౌనిషా ప్రియ
7. శ్రీ వాస్తవ
8. సిద్ధార్థ్ భరద్వాజ్
9. పూజ
10. హిషిత