రైలుకి ఎదురెళ్లి సెల్ఫీ.. యువకుడు దుర్మరణం

Siva Kodati |  
Published : Jun 09, 2019, 11:03 AM IST
రైలుకి ఎదురెళ్లి సెల్ఫీ.. యువకుడు దుర్మరణం

సారాంశం

ప్రభుత్వం, స్వచ్చంధ సంస్ధలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ యువత సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సెల్ఫీ కోసం రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు పొగొట్టుకున్నాడు. 

ప్రభుత్వం, స్వచ్చంధ సంస్ధలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ యువత సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సెల్ఫీ కోసం రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు పొగొట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ శాలిబండకు చెందిన దావూద్ శనివారం ఫలక్‌నూమా-గుల్బార్గ ప్యాసింజర్‌ రైలులో గుల్బార్గ వెళుతున్నాడు. ఆ సమయంలో ఔరంగాబాద్ ఎక్స్‌ప్రెస్ వస్తుండటంతో..  రైలు మంతట్టి రైల్వే స్టేషన్‌లో ఆగింది.

ఈ నేపథ్యంలో దావూద్‌కు ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. రైలుకు ఎదురుగా నిలబడి సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని స్నేహితులకు చెప్పడంతో వారు సరేననన్నారు. అయితే రైలు అమిత వేగంతో వచ్చి దావూద్‌ని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. 

PREV
click me!

Recommended Stories

నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది