తెలంగాణలో రూ. 6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు వినతి: ఈఆర్సీకి డిస్కంల టారిఫ్ ప్రతిపాదనలు

Published : Dec 27, 2021, 05:52 PM ISTUpdated : Dec 27, 2021, 07:55 PM IST
తెలంగాణలో రూ. 6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు వినతి: ఈఆర్సీకి డిస్కంల టారిఫ్ ప్రతిపాదనలు

సారాంశం

తెలంగాణలో రూ.6851 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు ఈఆర్సీకి ఏఆర్ఆర్‌లను సమర్పించాయి డిస్కం సంస్థలు, డిస్కం సంస్థలు సోమవారం నాడు ఈఆర్సీకి ఈ మేరకు చార్జీల పెంపు ప్రతిపాదనలను అందించాయి.

హైదరాబాద్: Telangana రాష్ట్రంలో రూ. 6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు Erc కి సోమవారం నాడు డిస్కంలు  tariff ప్రతిపాదనలను సమర్పించాయి. సుమారు రూ.4,037 కోట్లను ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు అంతర్గత సామర్ధ్యంతో పూడ్చుకొంటామని  డిస్కం సంస్థలు ఈఆర్సీకి తెలిపాయి. ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన discomలు ఈఆర్సీకి Arr లను సమర్పించాయి.

also read:కరెంట్ బిల్లు ఎగవేతదారుల్లో మంత్రి టాప్.. రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటన

2021-22 ఏడాదికి గాను Electricity  charges పెంపునకు గాను  ప్రతిపాదనలు  పంపాలని ఈఆర్సీ డిస్కంలకు వారం రోజుల గడువును ఇస్తూ ఈ నెల 21న ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇవాళ చార్జీల పెంపునకు సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాయి.

టారిఫ్ పెంపు ప్రతిపాదనలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి  ఇటీవల విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి అధికారులతో చర్చించారు.

తెలంగాణలో 2022-23 లో రెండు డిస్కం కంపెనీలు ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన ఏఆర్‌ఆర్‌లను సమర్పించాయి. 2022-23  లో రూ.53,053 కోట్ల రెవిన్యూ అవసరం. రూ. 36, 474 కోట్ల రెవిన్యూ వస్తోందని డిస్కం కంపెనీలు అంచనా వేశాయి. రూ.5652 కోట్లు ప్రభుత్వం నుండి సబ్సిడీ రూపంలో వస్తాయని డిస్కం కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. సుమారు రూ.10,928 కోట్ల రెవిన్యూ లోటు ఉంటుందని అంచనా వేశాయి

.అయితే ఈ రూ. 10,928 కోట్ల రెవిన్యూ లోటును పూడ్చుకొనేందుకు గాను విద్యుత్ చార్జీల పెంపునకు గాను డిస్కం కంపెనీలు టారిఫ్ పెంపు ప్రతిపాదనలను ఇవాళ ఈఆర్సీసీకి అందించాయి.రూ.6831 కోట్లను చార్జీల పెంపు ద్వారా ఆర్జించాలని ప్రతిపాదనలను పంపాయి.గృహ వినియోగదారులకు  యూనిట్ కు 50 పైసలు, ఇతర వినియోగదారులకు యూనిట్ కు రూ. 1 పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి.రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమయిందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా పెంచలేదని  ఇప్పుడు పెంచక తప్పదని అధికారులు చెబుతున్నారు.

డొమెస్టిక్ కనెక్షన్ ల పై యూనిట్ కు రూ.50పైసలు పెంపు ద్వారా రూ.2,110 కోట్లు ఆదాయం, హెచ్.టి కనెక్షన్ల రూ.1 పెంపు ద్వారా రూ.4,721కోట్లు ఆదాయం రానున్నట్లు డిస్కంలు చెప్తున్నాయి.ఇక ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్, 25.78 లక్షల పంపుసెట్లకు  24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ తో పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రూ. 2 సబ్సిడీ కింద అందించనున్నారు. అయితే ఈ సబ్సిడీని ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు అందించనుంది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్