మరో రెండు నెలలు కరోనా డెల్టా వేరియంట్ ప్రభావం: తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్

By narsimha lodeFirst Published Jul 20, 2021, 4:58 PM IST
Highlights


కరోనా డెల్టా వేరియంట్ ప్రభావం మరో రెండు మాసాల పాటు ఉండే అవకాశం ఉందని  తెలంగాణ డీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. రానున్న రోజుల్లో  పండుగల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  ఆయన కోరారు. మాస్కులు విధిగా ధరించాలన్నారు.

హైదరాబాద్: కరోనా డెల్టా వేరియంట్ ప్రభావం మరో రెండు నెలల పాటు కొనసాగుతోందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.మంగళవారం నాడు కోఠిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న 7 జిల్లాల్లో 11 వైద్య బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. ఈ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి గల కారణాలను ఈ బృందం కారణాలను అన్వేషిస్తుందన్నారు.

 రాష్ట్రంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదౌతున్నాయన్నారు. త్వరలోనే వరుసగా పండుగలు వస్తున్నందున  ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరారు మాస్కును విధిగా ధరించాలన్నారు. మాస్క్ ధరించకపోతే కరోనాను ఆహ్వానించినట్టేనని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం అన్ని రకాల చర్య లు తీసుకొంటుంది.  కరోనా కేసులు అధికంగా నమోదౌతున్న జిల్లాల్లో వైద్య బృందం పర్యటించి కారణాలను విశ్లేషించాలని కూడ వైద్య ఆరోగ్య శాఖాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. 
 

click me!