నిండిన హిమాయత్‌సాగర్ ప్రాజెక్టు: మూడు క్రస్ట్‌గేట్ల ఎత్తివేత

Published : Jul 20, 2021, 04:39 PM IST
నిండిన హిమాయత్‌సాగర్ ప్రాజెక్టు: మూడు క్రస్ట్‌గేట్ల ఎత్తివేత

సారాంశం

హిమాయత్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిపోవడంతో మంగళవారం నాడు సాయంత్రం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేశారు.  దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. 

హైదరాబాద్: హిమాయత్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన మూడు గేట్లను మంగళవారం నాడు  అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టుకు ఎగువ నుండి  వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో  ప్రాజెక్టుకు చెందిన మూడు గేట్లను ఎత్తారు. అడుగు మేర గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.గత వారం రోజులుగా హైద్రాబాద్ తో పాటు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదౌతున్నాయి. దీంతో  హిమాయత్ సాగర్  ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొంది. దీంతో ఇవాళ సాయంత్రం గేట్లు ఎత్తారు.

also read:నిండుకుండలా హిమాయత్‌సాగర్: నేడు గేట్లు ఎత్తనున్న అధికారులు

గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. గత ఏడాది కూడ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కూడ హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి  నీటిని  దిగువకు విడుల చేశారు.ఈ నెల 21వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు.తెలంగాణలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటీవల కాలంలో హైద్రాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.
 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!