మేమేమైనా నక్సలైట్లమా.. ఓవరాక్షన్ వద్దు: పోలీసులకు ఈటల వార్నింగ్

By Siva KodatiFirst Published Jul 20, 2021, 4:30 PM IST
Highlights

హుజురాబాద్‌లో పోలీసులకు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దని పోలీసులను ఆయన హెచ్చరించారు. మేమేమైనా నక్షలైట్లమని అనుకుంటున్నారా అంటూ గద్దించారు. 

హుజురాబాద్ నియోజకవర్గంలో తన పాదయాత్ర రెండో రోజు సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. తన వల్లే కేసీఆర్ దళితులకు కొత్త పథకాలు ప్రకటించారన్నారు. టీఆర్ఎస్ ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుని ఓటు మాత్రం తమకే వేయాలని సూచించారు ఈటల. ఎన్నికల వేళ ప్రజలను మోసం  చేయొద్దని ఆయన హితవు పలికారు.

Also Read:ఈటల హత్యకు కుట్ర... నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా...: మంత్రి గంగుల సవాల్ (వీడియో)

హుజురాబాద్‌కు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు ముందు తమ నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవాలన్నారు ఈటల రాజేందర్. తాను రాజీనామా చేసిన తర్వాత దాదాపు 11 వేల పెన్షన్లు మంజూరు చేశారని ఆయన గుర్తుచేశారు. 4.25 వేల తెల్లరేషన్ కార్డులు మంజూరు చేశారని అన్నారు. ఇదే సమయంలో పోలీసులకు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దని పోలీసులను ఆయన హెచ్చరించారు. మేమేమైనా నక్షలైట్లమని అనుకుంటున్నారా అంటూ గద్దించారు. 
 

click me!