కాంగ్రెస్‌కి ఏపూరి సోమన్న రాజీనామా: షర్మిల పార్టీలో చేరే ఛాన్స్?

Published : Mar 11, 2021, 05:55 PM IST
కాంగ్రెస్‌కి ఏపూరి సోమన్న రాజీనామా: షర్మిల పార్టీలో చేరే ఛాన్స్?

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ మరో షాక్ తగిలింది. గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ నెల 15న షర్మిల పార్టీలో ఏపూరి సోమన్న చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఆయన ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

హైదరాబాద్:  తెలంగాణ కాంగ్రెస్ మరో షాక్ తగిలింది. గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ నెల 15న షర్మిల పార్టీలో ఏపూరి సోమన్న చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఆయన ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

 గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ని విమర్శించాలన్న ఆలోచన తనకు లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద నమ్మకం లేదని చెప్పారు. పార్టీలో సీనియర్లు కూడా వారి భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారన్నారు. తెలంగాణలో నియంత ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని ఏపూరి సోమన్న అన్నారు.

 షర్మిల పార్టీలో చేరేందుకే ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఇందిరా శోభన్ షర్మిలను కలిశారు. ఆమెతో కలిసి నడుస్తానని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఏపూరి సోమన్న తన పాటలు, ఆటలతో కీలకంగా వ్యవహరించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?