బంగారం స్మగ్లింగ్ కేసు: ఘన‌శ్యామ్ జ్యూవెలరీ యజమాని కుమారుడు అరెస్ట్

By Siva KodatiFirst Published Mar 11, 2021, 6:17 PM IST
Highlights

బంగారం స్మగ్లింగ్ కేసులో ఘన శ్యామ్ జ్యూవెలరీ యజమాని కుమారుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ మేరకు ప్రీత్ కుమార్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ ప్రకటించింది

బంగారం స్మగ్లింగ్ కేసులో ఘన శ్యామ్ జ్యూవెలరీ యజమాని కుమారుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ మేరకు ప్రీత్ కుమార్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ ప్రకటించింది.

ఎగుమతి చేసే బంగారాన్ని దేశీయంగా అమ్మి సొమ్ము చేసుకున్నట్లు అతనిపై అభియోగాలున్నాయి. కోల్‌కతా డీఆర్ఐ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. 2018లో కోల్‌కతా ఎయిర్‌పోర్టులో 2018లో బంగారాన్ని స్వాధీనం చేసుకుంది ఈడీ.

ఈ క్రమంలో ప్రీత్ అగర్వాల్ సుమారు 250 కిలోల బంగారం అక్రమాలకు పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ తేల్చింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు చేసింది. అలాగే పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. భారీగా పన్నులు ఎగవేసి అక్రమార్జనతో ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ నిర్థారించింది. 

click me!