కూతురితో కలిసి మొక్కను నాటిన కడియం.. ముగ్గురు ఎమ్మెల్యేలకు గ్రీన్ ఛాలెంజ్

First Published Jul 29, 2018, 10:45 AM IST
Highlights

తెలంగాణ హరితహారంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసేందుకు గాను... మూడు మొక్కలు నాటండి.. మరో ముగ్గురి చేత మూడు మొక్కలు నాటండి అనే నినాదం ఇప్పుడు బాగా ప్రచారం పొందుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించి.. మరికొందరికి సవాల్ విసిరారు. 

తెలంగాణ హరితహారంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసేందుకు గాను... మూడు మొక్కలు నాటండి.. మరో ముగ్గురి చేత మూడు మొక్కలు నాటండి అనే నినాదం ఇప్పుడు బాగా ప్రచారం పొందుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించి.. మరికొందరికి సవాల్ విసిరారు. తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో తన కుమార్తె డాక్టర్ కావ్యతో కలిసి మొక్కలు నాటారు.

అనంతరం ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేశ్‌లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. తన సవాల్‌ను ముగ్గురు ఎమ్మెల్యేలు స్వీకరించి ఓరుగల్లు ప్రజలకు స్పూర్తినివ్వాలన్నారు.. పచ్చని చెట్లు, గొలుసు చెరువులతో కళకళలాడిన కాకతీయ నగరానికి హరితహారం,గ్రీన్‌ఛాలెంజ్, మిషన్ కాకతీయ ద్వారా పూర్వవైభవాన్ని తీసుకురావాలని.. భావితరాలకు కాలుష్యం నుంచి భద్రత కల్పించాలని ఉపముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అనంతరం మొక్కలు నాటిన సెల్పీలను  సోషల్ మీడియాలో ఉంచారు. 
 

click me!