తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది కాంగ్రెస్ సర్కార్.
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం నాడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. తొలిసారిగా బడ్జెట్ ను మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
తెలంగాణ బడ్జెట్ ను 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. రూ. 2, 75,891 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది.రెవిన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు, ద్రవ్యలోటు రూ.32,557 కోట్లుగా, రెవిన్యూ మిగులు రూ. 5,994 కోట్లుగా ప్రభుత్వం తెలిపింది.ఆరు గ్యారెంటీలకు రూ. 53, 196 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వ్యవసాయానికి రూ. 19, 746 కోట్లు, ఐటీ శాఖకు రూ. 774 కోట్లు, పురపాలక శాఖకు రూ. 11, 692 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.మూసీ ప్రాజెక్టుకు రూ. 1000 కోట్లు, విద్యారంగానికి రూ, 21, 389 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.