పేషెంట్లకు అన్యాయం చేయొద్దు: #ASK KTR‌లో ఆసుపత్రులకు మంత్రి విజ్ఞప్తి

By Siva KodatiFirst Published May 13, 2021, 7:03 PM IST
Highlights

గత కొంత కాలంగా ట్విట్టర్‌ ద్వారా నెటిజన్ల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు కూడా కేటీఆర్ #ASK KTR కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌లో తెలంగాణ ముందుందన్నారు. 

జాతీయ సగటు కంటే తెలంగాణలోనే ఎక్కువ వ్యాక్సినేషన్ జరిగిందని కేటీఆర్ వెల్లడించారు. వ్యాక్సిన్ ఉత్పత్తే ఇప్పుడు సవాల్‌గా మారిందని... ఆక్సిజన్ సరఫరా సైతం కేంద్రం తన చేతుల్లోకి తీసుకుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:మహబూబాబాద్‌లో కరోనాతో విషాదం: 11 రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురి మృతి

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ దొరకడం అనేది సవాల్‌గా మారిందని.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెమిడిసివర్ వాడకంపై ఆడిట్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అవసరం లేకున్నా వాటిని వాడుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

ఈ విషయంలో పేషెంట్లకు డాక్టర్లు అన్యాయం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. జూడాలకు జీతాలు పెంపు విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. లాక్‌డౌన్‌లో 4 గంటల సడలింపు కొనసాగుతుందన్నారు. ఆరోగ్యశ్రీలో కరోనా వైద్యం చేర్చే విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న ఆయన.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 45.37 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని కేటీఆర్ పేర్కొన్నారు. 

click me!