Telangana Floods: 19 వేల మందికి శిబిరాల్లో ఆశ్రయం కల్పించాం.. ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి: సీఎస్ సోమేశ్ కుమార్

Published : Jul 14, 2022, 05:22 PM IST
Telangana Floods: 19 వేల మందికి శిబిరాల్లో ఆశ్రయం కల్పించాం.. ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి: సీఎస్ సోమేశ్ కుమార్

సారాంశం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి, వరదలు వచ్చినప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. భారీ నష్టం ఏమీ జరగలేదని పేర్కొన్నారు.  

తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కూడా వర్షాలు కురుస్తుండగా.. గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ పరిస్థతులతో లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కురుస్తున్నభారీవర్షాలు, ఇప్పటివరకు చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్..  గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విపత్తు నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కూడా పాల్గొన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి, వరదలు వచ్చినప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. భారీ నష్టం ఏమీ జరగలేదని పేర్కొన్నారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలలో ఉన్నజిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తున్న ములుగు, భూపాలపల్లి, భద్రాచలం జిల్లాలపై మరింత అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడామని వెల్లడించారు. అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 16 మందిని, వైమానిక దళం మరో ఇద్దరిని రక్షించినట్టుగా తెలిపారు.

రాష్ట్రంలో 223 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 19,071 మందికి ఆశ్రయం కల్పించామని తెలిపారు. భద్రాచలం జిల్లాలో 43 శిబిరాలలో 6,318 మందికి, ములుగు జిల్లాలో 33 క్యాంప్ లలో 4,049 మందికి, భూపాలపల్లి జిల్లాలో 20 క్యాంప్ లలో 1,226 మందికి ఆశ్రయం కల్పించామని సోమేశ్ కుమార్ వివరించారు.

రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో తేలికపాటి వర్షం, 10 జిల్లాల్లో అతి తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసిందని ఈ సమీక్ష సందర్భంగా అధికారులు సీఎస్ కు వివరించారు. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షపాతం ఉండదని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం