తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్: Telangana రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో అతి Heavy Rains కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం నాడు రాత్రిలోపుగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆరు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా , గోదావరితో పాటు పలు నదులకు వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ , ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షాలతో పాటు గోదావరి నదికి వరద పోటెత్తడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు..ఈ జిల్లాల్లో జనజీవనం స్థంభించిపోయింది.
undefined
also read:పోటెత్తిన గోదావరి: భద్రాచలం బ్రిడ్జిపై నుండి 48 గంటలు రాకపోకలు నిలిపివేసే చాన్స్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున విద్యా సంస్థలకు ప్రభుత్వం శనివారం వరకు సెలవులను పొడిగించింది. సోమవారం నుండి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. ప్రజలంతా అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా అనవసరంగా ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.