అన్నపూర్ణ క్యాంటీన్లను తనిఖీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్

By Siva Kodati  |  First Published Apr 24, 2020, 5:19 PM IST

300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా రాష్ట్రంలో ప్రతిరోజూ 2 లక్షల మందికి భోజనాన్ని అందిస్తున్నామన్నారు సీఎస్ సోమేశ్ కుమార్ . శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ , జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్ తో కలసి టోలిచౌకి లోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించారు


300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా రాష్ట్రంలో ప్రతిరోజూ 2 లక్షల మందికి భోజనాన్ని అందిస్తున్నామన్నారు సీఎస్ సోమేశ్ కుమార్ . శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ , జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్ తో కలసి టోలిచౌకి లోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా సోమేశ్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ  9 మున్సిపల్ కార్పొరేషన్లలలో 300 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజనాన్ని అందిస్తున్నామని సీఎస్ తెలిపారు. మరో 50 కేంద్రాలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

Latest Videos

undefined

 

ఉదయం 10.30 నుంచి గంటన్నర పాటు, సాయంత్రం 5 గంటలకు మరోసారి భోజనం అందించే వేళలు మార్చామని తెలిపారు. ప్రతిరోజూ దాదాపు 2 లక్షల మందికి భోజనం అందించేలా చర్యలు తీసుకున్నామని సోమేశ్ తెలిపారు.

అవసరమైతే ఇంకా ఎక్కువ సెంటర్లు పెంచటానికి సిద్దంగా ఉన్నామన్నారు. ప్రతి సర్కిల్ లో ఒక ప్రత్యేక వాహాన్నాన్ని సిద్ధంగా రేడిమేడ్ కుకుడ్ పుడ్ ను అవసరం ఉన్న చోటకు వెంటనే అందిచేలా చర్యలు తీసుకున్నామని సోమేశ్ పేర్కొన్నారు.

 

ఎక్కడైనా భోజనం అవసరం ఉంటే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ నెం 21111111 కాల్ చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ ఆప్ ద్వారా ఆహారాన్ని కోరవచ్చని సీఎస్ చెప్పారు. అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి భోజనం అందించే విషయమై మున్సిపల్ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్‌ కుమార్‌లతో ప్రతి రోజు సమీక్షిస్తున్నామని సోమేశ్ చెప్పారు.

భోజనం విషయమై ప్రభుత్వానికి తగు సహకారం అందించాలని అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సి.యస్ కోరారు. ఎక్కడైన సమస్య ఉంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అన్నపూర్ణ క్యాంటిన్ ద్వారా భోజనం అందిస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్వక్తం చేశారు

click me!