జంటనగరాల పరిదిలో అత్యధికంగా లాక్ డౌన్ ఉల్లంఘనల కేసులు నమోదౌతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా కూడ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. లాక్‌డౌన్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ రోడ్లపైకి వచ్చినవారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
హైదరాబాద్: జంటనగరాల పరిదిలో అత్యధికంగా లాక్ డౌన్ ఉల్లంఘనల కేసులు నమోదౌతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా కూడ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. లాక్‌డౌన్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ రోడ్లపైకి వచ్చినవారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. వాహనాలు సీజ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడ ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
undefined
also read:లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: ఒక్కరోజులోనే 1.25 లక్షల వాహనాలు సీజ్
అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. హైద్రాబాద్ కమిషనరేట్ పరిధిలో 5 లక్షల వాహనాలు, సైబరాబాద్ లో 6 లక్షలు, రాచకొండ పరిధిలో 4 లక్షల వాహనాల వాహనాలపై కేసు నమోదు చేశారు. హైద్రాబాద్ పరిధిలో 45 వేలు, సైబరాబాద్ లో 20 వేలు, రాచకొండలో 15 వేల వాహనాలు సీజ్ చేశారు..లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతే ఈ వాహనాలను పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు.
మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.60 లక్షల వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులు సరైన కారణం చెబితే పోలీసులు వారిని వదిలేస్తున్నారు. అత్యవసర విధులు నిర్వహించే వారికి పాసులు జారీ చేశారు. ఈ పాసులను కూడ దుర్వినియోగం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ పాసులను కూడ రద్దు చేస్తామని హెచ్చరించారు.