తెలంగాణ కరోనా అప్ డేట్: రోజురోజుకు పెరుగుతున్న కేసులు...తాజాగా 313పాజిటివ్

Arun Kumar P   | Asianet News
Published : Mar 19, 2021, 11:03 AM ISTUpdated : Mar 19, 2021, 11:05 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: రోజురోజుకు పెరుగుతున్న కేసులు...తాజాగా 313పాజిటివ్

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కు చేరితే టెస్టుల సంఖ్య 94,82,649కు చేరాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో(బుధవారం రాత్రి 8గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 62,972మందికి కరోనా టెస్టులు చేయగా 313మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,02,360కు చేరితే టెస్టుల సంఖ్య 94,82,649కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 142మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,98,262కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 2,434 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 943గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1664కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96.2శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 98.64శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 3,నాగర్ కర్నూల్ 1, జోగులాంబ గద్వాల 4,  కామారెడ్డి 16, ఆదిలాబాద్ 10, భూపాలపల్లి 1, జనగామ 5, జగిత్యాల 8, అసిఫాబాద్ 5, మహబూబ్ నగర్ 9, మహబూబాబాద్ 5, మెదక్ 1, నిర్మల్ 25, నిజామాబాద్ 15,  సిరిసిల్ల 12, వికారాబాద్ 8, వరంగల్ రూరల్ 2,  ములుగు 2, పెద్దపల్లి 3, సిద్దిపేట 7, సూర్యాపేట 7, భువనగిరి 8, మంచిర్యాల 10, నల్గొండ 8 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 47కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 20, రంగారెడ్డి 29, కొత్తగూడెం 3, కరీంనగర్ 9, ఖమ్మం 8,  సంగారెడ్డి 13, వరంగల్ అర్బన్ 8కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:

 

PREV
click me!

Recommended Stories

25 ఏళ్ల క్రితం కలిసిన ఫ్రెండ్ కోసం కేరళ నుంచి తెలంగాణకు వచ్చిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్తారు
రైతు ఆశీర్వాద సభలో బట్టి విక్రమార్క సూపర్ స్పీచ్ | Bhatti Vikramarka Speech at Rythu Ashirvada Sabha