సింగిల్ బెడ్రూం ఇంటికి.. కరెంట్ బిల్లు రూ.25లక్షలు!

Published : Jul 07, 2020, 09:43 AM IST
సింగిల్ బెడ్రూం ఇంటికి.. కరెంట్ బిల్లు రూ.25లక్షలు!

సారాంశం

లాలాపేట జనప్రియా అపార్ట్‌మెంట్‌లో సింగిల్‌ బెడ్రూం ప్లాట్‌లో కృష్ణమూర్తి ఉంటున్నారు. ఐతే లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలల పాటు బిల్లు తీయలేదు.   

ఓ సింగిల్ బెడ్రూం ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వచ్చే అవకాశం ఉంది..? మహా అయితే.. రెండు వేలు, మూడు వేలు. లేదు.. అంతకన్నా ఎక్కువగా వాడతారు అనుకుంటే ఓ ఐదు వేలు వచ్చే అవకాశం ఉంది. కానీ.. ఓ కుటుంబానికి మాత్రం ఏకంగా రూ.25లక్షలు వచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..కరెంట్‌ బిల్లు ఓ వినియోగదారుడికి గట్టి షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.25 లక్షల విద్యుత్‌ బిల్లు రావడం చూసి ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మన్నంత పనైంది. హైదరాబాద్‌లోని లాలాపేట జనప్రియా అపార్ట్‌మెంట్‌లో సింగిల్‌ బెడ్రూం ప్లాట్‌లో కృష్ణమూర్తి ఉంటున్నారు. ఐతే లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలల పాటు బిల్లు తీయలేదు. 

ఆయన ఇంటి మీటర్‌కు మార్చి 6 నుంచి జూలై 6 వరకు 3,45,007 యూనిట్లకు రూ.25,11,467 బిల్లు వేశారు. దీన్ని చూసి కృష్ణమూర్తి సోమవారం తార్నాకలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. మీటర్‌లో లోపం ఉందని అధికారులు తెలిపారు. ఆ ఇంటికి కొత్త మీటరు వేసి రూ.2,095 వేశారు.

PREV
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?