అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ కసరత్తు:ఆ 22 స్థానాల్లో ఆశావాహులకు లైన్ క్లియర్

By narsimha lode  |  First Published Aug 29, 2023, 5:21 PM IST

తెలంగాణ ఎన్నికల్లో  పోటీ చేసేందుకు ఆశావాహుల ధరఖాస్తుల నుండి  అభ్యర్థుల పేర్లను  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం షార్ట్ లిస్ట్ చేయనుంది. 


హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ  సమావేశమైంది. మంగళవారంనాడు  హైద్రాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది.  పార్టీ టిక్కెట్ల కోసం  అందిన ధరఖాస్తుల ఆధారంగా ఎన్నికల కమిటీ  షార్ట్ లిస్టును తయారు చేయనుంది.  ఎలాంటి  వివాదం లేని  అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాలను ఖరారు చేసి  స్క్రీనింగ్ కమిటీకి  సిఫారసు చేసే అవకాశం ఉంది. 


ఒక్క పేరు వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాలు

Latest Videos

కొడంగల్-రేవంత్ రెడ్డి
హుజూర్‌నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ-పద్మావతి
మధిర-మల్లుభట్టి విక్రమార్క
మంథని-శ్రీధర్ బాబు
ములుగు- సీతక్క
జగిత్యాల-జీవన్ రెడ్డి
భద్రాచలం-పోడెం వీరయ్య
సంగారెడ్డి-జగ్గారెడ్డి
నల్గొండ-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఆలంపూర్-సంపత్
నాగార్జునసాగర్- కుందూరు జయవీర్ రెడ్డి
కామారెడ్డి-షబ్బీర్ అలీ
మంచిర్యాల-ప్రేంసాగర్ రావు
ఆంథోల్- దామోదర రాజనరసింహ
పరిగి-రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్-ప్రసాద్ 
ఇబ్రహీంపట్నం-మల్ రెడ్డి రంగారెడ్డి
ఆలేరు-అయిలయ్య
నాంపల్లి-ఫిరోజ్ ఖాన్
జడ్చర్ల-అనిరుధ్ రెడ్డి
వరంగల్ ఈస్ట్- కొండా సురేఖ

రెండు లేదా మూడు పేర్లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు

వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, మేఘారెడ్డి, శివసేన రెడ్డి, ఇల్లెందులో కోరం కనకయ్య, చీమల వెంకటేశ్వర్లు, మహబూబాబాద్  బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, మురళీ నాయక్, జనగామ నుండి పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, రాజిరెడ్డి, షాద్ నగర్, ఈర్లపల్లి శంకర్, ప్రవీణ్ యాదవ్, కొల్లాపూర్ నుండి జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర రావు, హుస్నాబాద్ నుండి  పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నుండి ఇందిర, దొమ్మాటి సాంబయ్య, మునుగోడు నుండి పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి, కైలాస్ నేత, ఎల్ బీ నగర్ నుండి మధు యాష్కీ, మల్ రెడ్డి రాంరెడ్డి, కల్వకుర్తి నుండి  వంశీచంద్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి కంది శ్రీనివాస్ రెడ్డి, గండ్ర సుజాత, ఎల్లారెడ్డి నుండి సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ , జూబ్లీహిల్స్ నుండి విష్ణువర్థన్ రెడ్డి, అజహరుద్దీన్, ఖైరతాబాద్ నుండి రోహిన్ రెడ్డి, విజయా రెడ్డి, సూర్యాపేట నుండి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, మిర్యాలగూడ నుండి లక్ష్మారెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి,దేవరకొండ నుండి బాలునాయక్,రమేష్ నాయక్, కిషన్ నాయక్ పేర్లను పంపే అవకాశం ఉందని సమాచారం.

మక్తల్ నుండి శ్రీహరి, నాగార్జున గౌడ్, గద్వాల నుండి సరిత, రాజీవ్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుండి నాగం జనార్థన్ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఉప్పల్ నుండి లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నుండి నర్సారెడ్డి, కొలను హన్మంత్ రెడ్డి, ముషీరాబాద్ నుండి అంజన్ కుమార్ యాదవ్, జగదీశ్వర్ రావు, మలక్ పేట నుండి శ్రీనివాసరావు,ఆశ్వథ్ ఖాన్, గోషామహల్ నుండి మెట్టు సాయికుమార్, లలనీ, సనత్ నగర్ నుండి నీలిమ, మర్రి ఆదిత్య రెడ్డి, తుంగతుర్తి నుండి జ్ఞానసుందర్, అద్దంకి దయాకర్, ల పేర్లను  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం   స్క్రీనింగ్ కమిటీకి పంపే అవకాశం ఉంది.

also read:అభ్యర్థుల ఎంపికకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: నేడు ఎన్నికల కమిటీ భేటీ

 వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన  ఆశావాహుల నుండి కాంగ్రెస్ పార్టీ  ఈ నెల  18 నుండి 25వ  తేదీ వరకు  ధరఖాస్తులను స్వీకరించింది.   119 అసెంబ్లీ నియోజకవర్గాలకు  గాను  1050 ధరఖాస్తులు వచ్చాయి.  ఈ ధరఖాస్తులపై  ఇవాళ  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ  ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేయనుంది.

 

click me!