అధిష్టానం వార్నింగ్ బేఖాతరు: హైద్రాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ల భేటీ

Published : Mar 20, 2022, 03:08 PM IST
అధిష్టానం వార్నింగ్ బేఖాతరు: హైద్రాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ల భేటీ

సారాంశం

కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఇవాళ సమావేశమయ్యారు. ఈ సమావేశం నిర్వహించవద్దని కూడా పార్టీ అధిష్టానం సూచించింది. అయినా కూడా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. పార్టీకి వ్యతిరేకంగా  తాము సమావేశం కాలేదని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.


హైదరాబాద్:  Congress పార్టీకి చెందిన తెలంగాణ సీనియర్లు ఆదివారం నాడు హైద్రాబాద్‌ నగరంలోని ఆశోకా హోటల్‌లో సమావేశమయ్యారు.ఈ సమావేశం నిర్వహించవద్దని కూడా పార్టీ నాయకత్వం సూచించింది. అయినా కూడా ఈసమావేశాన్ని పార్టీ సీనియర్లు నిర్వహిస్తున్నారు.

Hyderabad లో సీనియర్ల సమావేశం గురించి తెలుసుకొన్న ఎఐసీసీ సెక్రటరీ Bose Raju పార్టీ సీనియర్లకు పోన్ చేశారు. సమావేశం నిర్వహించవద్దని సూచించారు.ఈ సమావేశం నిర్వహిస్తే చర్యలు తప్పవని కూడా బోస్ రాజు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ సీనియర్లు వి. హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డిలకు బోస్ రాజు ఫోన్ చేసినట్టుగా ప్రచారం సాగుతుంది.

బోస్ రాజు హెచ్చరికలను పార్టీ సీనియర్లు పట్టించుకోలేదు.  ఆశోక హోటల్ లో సీనియర్లు సమావేశమయ్యారు.ఈ సమావేశానికి వి. హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్టీలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై నేతలు మండిపడ్డారు.

పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై సీనియర్లు చర్చించనున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై సీనియర్లు పార్టీ నాయకత్వానికి నివేదిక ఇవ్వాలని భావిస్తున్నారు.  బోస్ రాజు సమావేశం నిర్వహించవద్దని సూచించినా కూడా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అంతేకాదు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా నేతలు చర్చించారు. అయితే ఈ తరహా పరిస్థితి రాకుండా Telanganaలో ఏం చేయాలనే దానిపై కూడా చర్చించినట్టుగా సమాచారం. మరో వైపు రేవంత్ రెడ్డి తీరుపై కూడా చర్చించారని తెలుస్తుంది. 

ఈ సమావేశానికి ఎక్కువగా Revanth Reddy  తీరును వ్యతిరేకించే నేతలు హాజరు కావడంపై అసమ్మతి సమావేశంగా ముద్ర పడిందనే వాదనను మర్రి శశిధర్ రెడ్డి తోసిపుచ్చారు. తాము మూడేళ్లుగా  ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని కూడా శశిధర్ రెడ్డి గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. త్వరలోనే పార్టీ అధిష్టానాన్ని కలిసి పరిస్థితులను వివరిస్తామని కూడా శశిధర్ రెడ్డి చెప్పారు.పార్టీకి వ్యతిరేకంగా ఈ సమావేశాలు చిత్రీకరించవద్దని కూడా శశిధర్ రెడ్డి కోరారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాము తాపత్రయపడుతున్నామని ఆయన వివరించారు.

సీనియర్ల సమావేశంపై అద్దంకి దయాకర్ ఫైర్

హైద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సమావేశం కావడంపై పార్టీ అధికార ప్రతినిధి Addanki Dayakar సీరియస్ అయ్యారు. మంత్రి harish Rao తో పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఎందుకు సమావేశమయ్యారని ప్రశ్నించారు. హరీష్ రావుతో  కాంగ్రెస్ పార్టీ ఎలా బలోపేతం చేయాలని  హనుమంతరావు చర్చించారా అని దయాకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీని రక్షించుకోవాలనే నేతలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయబోరని ఆయన అన్నారు. పార్టీ వేదికలపైనే తమ అభిప్రాయాలు చెబతారని ఆయన అభిప్రాయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Daughter Kills Parents: ప్రేమ పెళ్లి విషాదం.. తల్లిదండ్రులను హతమార్చిన కూతురు | Asianet News Telugu
Medaram Sammakka Saralamma Jatara 2026 Begins | 4000 Special RTC Buses | Asianet News Telugu