బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై కోమటిరెడ్డి వ్యాఖ్యల కలకలం: తప్పు బడుతున్న సీనియర్లు

By narsimha lode  |  First Published Feb 14, 2023, 2:35 PM IST

బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుపై  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలు  కాంగ్రెస్ నేతలు  తప్పుబడుతున్నారు. ఈ వ్యాఖ్యలు  వెంకట్ రెడ్డి  వ్యక్తిగతమైనవిగా  పార్టీ నేతలు చెబుతున్నారు.  



హైదరాబాద్:: భువనగిరి  ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలు  కాంగ్రెస్ పార్టీలో  గందరగోళానికి  కారణమయ్యాయి.   ఈ వ్యాఖ్యలను  పార్టీ సీనియర్లు తప్పుబడుతున్నారు.  ఈ వ్యాఖ్యలను కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  వ్యక్తిగతమైనవిగా  పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
 కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  వ్యాఖ్యలు  పార్టీకి నష్టం చేకూర్చే విధంగా  ఉన్నాయని  పార్టీ సీనియర్లు  చెబుతున్నారు. 

రాష్ట్రంలో  ఏ పార్టీతో  పొత్తు ఉండదని  కాంగ్రెస్ పార్టీ  నేతలు చెబుతున్నారు.  బీఆర్ఎస్ తో  తమ పార్టీ  ఎట్టి పరిస్థితుల్లో  పొత్తు ఉండదని కూడా  ఆ పార్టీ అగ్ర నాయకత్వం  ప్రకటించింది.  వరంగల్  లో  నిర్వహించిన  సభలో  పొత్తుల విషయమై  రాహుల్ గాంధీ  స్పష్టం  చేసిన విషయాన్ని  కాంగ్రెస్ సీనియర్లు గుర్తు  చేస్తున్నారు. 

Latest Videos

undefined

బీఆర్ఎస్ తో  కాంగ్రెస్ పొత్తు ఎట్టి పరిస్థితులో  ఉండదని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  గతంలో పలుమార్లు  ప్రకటించారు. అయితే  దానికి భిన్నంగా  ఇవాళ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి   వ్యాఖ్యలు చేశారు.  2023  ఎన్నికల తర్వాత  బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య  పొత్తు ఉంటుందని ప్రకటించారు.  

ఈ ఏడాది చివర్లో  అసెంబ్లీకి జరిగే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ఈ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం  చేసుకోవాలని  ఆ పార్టీ  పట్టుదలగా  ఉంది.ఈ తరుణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం  చేకూర్చేలా  ఉన్నాయని  సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకంగా  చేశారా లేక  యాధృచ్ఛికంగా  చేశారా అనే విషయం పక్కన పెట్టాలని  కొందరు నేతలు వాదిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు  పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయనే అభిప్రాయంతో  నేతలున్నారు.  ఇవే వ్యాఖ్యలు  పార్టీలో  ఇతర నేతలు  చేస్తే  పార్టీ నాయకత్వం  ఎలా వ్యవహరించేదని  ఆ పార్టీ నేత  అద్దంకి దయాకర్ ప్రశ్నిస్తున్నారు.  పార్టీకి నష్టం చేసేలా ఈ వ్యాఖ్యలు  ఉన్నాయని  దయాకర్ అభిప్రాయపడ్డారు.  

 వచ్చే ఎన్నికల్లో  బీఆర్ఎసే , కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ  సాగుతుందని కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి  చెప్పారు. గందరగోళానికి  గురిచేసేలా  నాయకులు మాట్లాడడం  సరైంది కాదని  మల్లు రవి పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో  మూడింట  రెండు వంతుల మెజారిటీతో  కాంగ్రెస్ పార్టీ   గెలుస్తుందని ఆయన  చెప్పారు. 

also read:బీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీమ్: తెలంగాణలో మాదే అధికారమన్న బండి సంజయ్

బీఆర్ఎస్ తో  కాంగ్రెస్ పార్టీ  పొత్తు పెట్టుకోదని  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్  మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం  చేశారు. పొత్తులపై  పార్టీ నేతలు సమిష్టిగా  నిర్ణయం తీసుకుంటారని  ఆయన చెప్పారు. అయితే  పొత్తులపై  ఎవరూ మాట్లాడినా  కూడా ఈ వ్యాఖ్యలన్నీ కూడా  వ్యక్తిగతమైనవని  మహేష్ కుమార్ గౌడ్  స్పష్టం  చేశారు.  బీఆర్ఎస్ తో  పొత్తులపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై   ఆయన  పరోక్షంగా   స్పందించారు.ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ నేత  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  బీఆర్ఎస్ తో పొత్తులపై  చేసిన వ్యాఖ్యలపై పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు  ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఎన్నికల సమయంలో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు  చేయడం సరైంది కాదని  ఆయన  చెప్పారు. 

click me!