రేవంత్ పాలనలో కాంగ్రెస్ ఆందోళన ... టిపిసిసి పిలుపు 

By Arun Kumar P  |  First Published Dec 21, 2023, 2:54 PM IST

తెలంగాణలో అధికాారంలోకి వచ్చినతర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటిసారి నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.  పార్లమెంట్ సమావేశాల నుండి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి నిరసనలకు పిలుపునిచ్చింది. 


హైదరాబాద్ : పార్లమెంట్ సమావేశాల నుండి ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ రేపు(శుక్రవారం) ఇండియా కూటమి ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో  అధికార కాంగ్రెస్ నాయకులతో పాటు ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలు ఆందోళనకు సిద్దమయ్యాయి. శుక్రవారం ఉదయం 11 గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ తో పాటు అన్నిజిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. 

హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్దగల ధర్నాచౌక్ లో ఇండియా కూటమి పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టనున్నట్లు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలో భారీఎత్తున తరలివచ్చి ఈ ధర్నాలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఖరిని నిరసినగా  ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. 

Latest Videos

undefined

కేవలం హైదరాబాద్ లోనే కాదు తెలంగాణవ్యాప్తంగా ఇండియా కూటమి ధర్నాలు కొనసాగుతాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు. 

పార్లమెంట్ లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ : 

కట్టుదిట్టమైన భద్రత వుండే పార్లమెంట్ లోకి కొందరు దుండగులు ప్రవేశించి నానా హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. లోక్ సభ సమావేశాలు జరుగుతుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో  ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులంతా పార్లమెంట్ పై జరిగిన దాడిపై హోమంత్రి వివరణ ఇవ్వాలని కోరుతూ నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలకు దిగడంతో లోక్ సభ, రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేసారు. ఇలా ఇప్పటివరకు  143 మంది ఎంపీలు పార్లమెంట్ సమావేశాల నుండి సస్పెండ్ అయ్యారు.

పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకపోగా ఇలా ప్రతిపక్ష ఎంపీలందరిని సస్పెండ్ చేయడంతో ఇండియా కూటమి సీరియస్ అయ్యింది. ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చింది.  దేశవ్యాప్తంగా రేపు(శుక్రవారం) కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ధర్నాలు చేపట్టనుంది. 


 

click me!