ఇంట్టో అందరూ వుండగానే ఎంచక్కా బీరువా తాళాలు తెరిచి అరకిలో బంగారం దోచుకెళ్లారు కేటుగాళ్ళు. అంతా అయిపోయాక మెళ్లిగా తేరుకున్న కుటుంబం దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేసారు.
హైదరాబాద్ : ఇంట్లో అందరూ వుండగానే అరకిలో బంగారాన్ని దోచుకెళ్ళారు ఘరానా దొంగలు. ఇంటి యజమాని సహకారంతోనే పట్టపగలే దర్జాగా చొరబడ్డ దొంగలు చాలా ఈజీగా లక్షల విలువచేసే బంగారాన్ని దోచుకున్నారు. ఈ ఇంటిదోపిడి హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
పోలీసులు కథనం ప్రకారం... యూసుఫ్ గూడ కల్యాణ్ నగర్ లో పి.సూర్యనారాయణరాజు కుటుంబంతో కలిసి నివాసం వుంటున్నాడు. ఇంట్లో శుభకార్యం వుండటంతో బ్యాంక్ లాకర్ లో దాచిన బంగారాన్ని తీసుకువచ్చారు. శుభకార్యం ముగిసినా బంగారాన్ని ఇంట్లోని బీరువాలో దాచారు. ఇటీవల ఇంట్లోని బంగారాన్ని తిరిగి బ్యాంక్ లాకర్ లో పెడదామని సూర్యానారాయణరాజు కుటుంబసభ్యులు భావించారు. కానీ బంగారాన్ని దాచిన బీరువా తాళాలు కనిపించలేదు. దీంతో కంగారుపడిపోయిన వాళ్లు డూప్లికేట్ తాళాలతో బీరువా తెరిచేవారిని ఆశ్రయించారు.
undefined
బీరువాను తెరిచేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు సూర్యనారాయణరాజు కుటుంబం దృష్టిమరల్చి బీరువాలోని బంగారాన్నిదోచుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లోని ఎవ్వరూ గమనించలేకపోయారు.దీంతో ఎంతప్రయత్నించినా డూప్లికేట్ తాళాలలో బీరువా తెరుచుకోవడం లేదని చెప్పి వెళ్ళిపోయారు. ఇలా అందరిముందే అరకిలో బంగారంతో చెక్కేసారు. ఇటీవల బీరువా తెరిచేవరకు అసలు దొంగతనం జరిగిన విషయమే సూర్యనారాయణ కుటుంబానికి తెలియదు.
Also Read Adilabad : బస్సులో సీటు కోసం ఎంతకు తెగించాడు...!
ఇటీవల బీరువా తాళం దొరకడంతో తెరిచిచూడగా బంగారం కనిపించలేదు. దీంతో డూప్లికేట్ తాళాలతో తెరవడానకి వచ్చినవారే ఈ దొంగతనం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ దొంగతనంపై పోలీసులకు సూర్యనారాయణరాజు కుటుంబం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.