ముందస్తు ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ హామీలు ఇవేనా..?

By sivanagaprasad KodatiFirst Published Sep 5, 2018, 1:36 PM IST
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవని స్పష్టమైన సంకేతాలు వస్తుండటంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జనాల్లో బలంగా ఉన్న కేసీఆర్ ఛరిష్మాను తట్టుకుని నిలబడాలంటే ప్రజలను ఆకర్షించే హామీలు ఇవ్వాలి. దీంతో ఏం హామీలు ఇవ్వాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు టీపీసీసీ నేతలు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవని స్పష్టమైన సంకేతాలు వస్తుండటంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జనాల్లో బలంగా ఉన్న కేసీఆర్ ఛరిష్మాను తట్టుకుని నిలబడాలంటే ప్రజలను ఆకర్షించే హామీలు ఇవ్వాలి. దీంతో ఏం హామీలు ఇవ్వాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు టీపీసీసీ నేతలు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఇవాళ గాంధీ భవన్‌లో అత్యవసరంగా సమావేశమైంది. 

ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను ప్రకటించింది కాంగ్రెస్. వీటికి తోడు మేనిఫెస్టో‌లో చేర్చాల్సిన అంశాలపై ఈ కమిటీ సీనియర్ నేతలతో చర్చించి కొన్ని ప్రతిపాదనలను టీపీసీసీకి అందజేసింది. వాటిలో కొన్ని 

-ఇళ్లు లేని కుటుంబాలకు రూ.5 లక్షలు
-ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు రూ.లక్ష అదనం
-ఇందిరమ్మ ఇళ్లలో రూ.2 లక్షలతో అదనంగా మరో గది
-మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
-కల్యాణ లక్ష్మీతో పాటు బంగారు లక్ష్మీని కొనసాగిస్తాం
-దివ్యాంగులను పెళ్ళి చేసుకుంటే రూ.2 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదన
-దివ్యాంగుల శాఖ విలీనం రద్దు
 

click me!