తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కునో: నేతల మధ్య తీవ్ర పోటీ

By narsimha lodeFirst Published Feb 23, 2020, 6:47 PM IST
Highlights

తెలంగాణ పీసీసీ పదవి కోసం నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎవరికి వారే నేతలు ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 


హైదరాబాద్: పీసీసీ చీఫ్ పదవి కోసం నేతలు తమ ప్రయత్నాలు వారే చేసుకుంటున్నారు. ఢిల్లీ హై కమాండ్ దృష్టిలో పడితే పీసీసీ చీఫ్ దక్కించుకోవచ్చన్న ధీమాతో లాబీయింగ్ లు మొదలు పెట్టారు.  మున్సిపల్ ఎన్నికల అనంతరం  పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేయడంతో...త్వరలో కొత్త చీఫ్ పీసీసీ రానున్నట్లు పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది.

పీసీసీ అధ్యక్ష పదవిని దక్కిచుకునేందుకు అంతా  అగ్రవర్ణాల నేతల మధ్య పోటీ ఉందన్న చర్చ కూడా  కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. పార్టీలో సీనియర్ నేతలుగా గుర్తింపు పొందిన ఎంపీ కొమటిరెడ్డి  వెంకటరెడ్డి,  ఎమ్మల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ రేవంత్ రెడ్డి తదితరుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కోమటిరెడ్డి మాత్రం పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయని, సోనియాను కలిసి తనకు పీసీసీ ఛీఫ్ గా అవకాశం కల్పించాలని కోరుతానని ఇటీవలే వెల్లడించారు. రేవంత్ రెడ్డి మాత్రం తనకున్న లాబీయింగ్ ను నమ్ముకుని పీసీసీ పదవి  కోసం పావులు కదుపుతున్నారు.

జగ్గారెడ్డి కూడ పీసీసీ చీఫ్ పదవి కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి నేతల మద్దతు కూడగట్టారన్న ప్రచారం ఉంది.

 పార్టీలో తాను కూడా ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్నానని, పరిస్థితుల కారణంగానే   కొద్ది రోజులు పార్టీ కి దూరం కావాల్సి వచ్చిందని అధిష్టానం ముందు తన అభిప్రాయాన్ని  స్పష్టం చేసినట్లు సమాచారం. తనకు అవకాశం కల్పించాలని జగ్గారెడ్డి  పార్టీ హై కమాండ్ ముందు తన ప్రతిపాదనను ఉంచినట్లు తెలుస్తోంది.

Also read:బీజేపీకి కొత్త సారథులు: తెలుగు రాష్ట్రాల్లో వీరి మధ్యే పోటీ

మరో సీనియర్ నేత ఆయిన శ్రీధర్ బాబు అందరితో నేతలతో సమన్వయం ఉందని, కాంగ్రెస్ లో ఉన్న వర్గ పోరు కు తెరదించాలంటే శ్రీధర్ బాబు లాంటి నేతలకు అవకాశం ఇవ్వాలన్న  అభిప్రాయాలను కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పీసీసీ చీఫ్ పదవిని ఎవరికి కట్టబెడుతోందోననే ఆసక్తి సర్వత్రా  నెలకొంది.  బీసీ నేత వి. హనుమంతరావు కూడ పీసీసీ చీఫ్ పదవిని తనకు ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు.
 

click me!