ఢిల్లీ చేరిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ: పెద్దలతో రేవంత్ మంత్రాంగం

Published : Mar 22, 2022, 09:59 AM ISTUpdated : Mar 22, 2022, 10:14 AM IST
ఢిల్లీ చేరిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ: పెద్దలతో రేవంత్ మంత్రాంగం

సారాంశం

 తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా మరికొందరు నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యవహరాలపై కాంగ్రెస్ నాయకత్వానికి ఫిర్యాదు చేయనున్నారు.

హైదరాబాద్: Telangana కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. టీపీసీసీ చీఫ్ Revanth Reddy వ్యవహర శైలిపై సీనియర్లు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మరో వైపు  సంగారెడ్డి ఎమ్మెల్యే Jagga Reddy తీరుపై పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  Manickam Tagore కు ఫిర్యాదు చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే జగ్గారెడ్డి బాధ్యతతలను ఇతర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగించారు.

రెండు రోజుల క్రితం హైద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత Sanga Reddy లో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కాంగ్రె్ అభ్యర్ధిని బరిలో నిలిపి తనపై గెలిపించాలని రేవంత్ రెడ్డికి Jagga Reddy సవాల్ విసిరారు. ఈ సవాల్ విసిరిన  24 గంటల్లో Congress పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుండి  జగ్గారెడ్డిని తప్పించారు.

సీఎల్పీ నేత MalluBhatti Vikramarka, మాజీ మంత్రి శ్రీధర్ బాబు,  మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితరులు కూడా ఇవాళ Delhi బాట పట్టారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తీరుపై కొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. 

పార్టీ అగ్రనేతల అపాయింట్ మెంట్ ను కూడా కోరినట్టుగా వి. హనుమంతరావు రెండు రోజుల క్రితం ప్రకటించారు. మంత్రి హరీష్ రావును వి. హనుమంతరావు కలవడంపై రేవంత్ వర్గీయులు మండిపడుతున్నారు. హరీష్ రావుతో కలిసి పార్టీని బలోపేతం చేసేందుకు  వ్యూహాన్ని రచిస్తున్నారా అని రేవంత్ వర్గీయులు సెటైర్లు వేస్తున్నారు.

జగ్గారెడ్డి వ్యవహరశైలిపై రేవంత రెడ్డి వర్గం చాలా కాలంగా అసంతృప్తితో ఉంది. జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డితో తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహర శైలిని  ఆది నుండి మీడియా వేదికగా తప్పు బడుతున్నారు జగ్గారెడ్డి.

పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా  వ్యక్తిగత ప్రయోజనం కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జగ్గారెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించకుండా పార్టీ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి నిర్ణయించడంపై  జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు.

రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తితోనే  గత నెల 18న  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే సీనియర్ల సూచనతో రాజీనామాను కొంత కాలం వాయిదా వేసినట్టుగా ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Telangana Politics : రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెడుతున్నారా..? మంత్రుల భేటీవెనక అసలు సంగతేంటి..?
Jio AI Education : జియో ఏఐ ఎడ్యుకేషన్.. విద్యార్థులకు, టీచర్లకు రూ. 35 వేల విలువైన ప్లాన్ ఉచితం !