వైఎస్ రాజశేఖర్ రెడ్డి నరరూప రాక్షసుడు.. శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు..

Published : Jun 25, 2021, 02:34 PM IST
వైఎస్ రాజశేఖర్ రెడ్డి నరరూప రాక్షసుడు.. శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు..

సారాంశం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలతో మళ్లీ గొడవలు వద్దని హితవు పలికారు. 

తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తప్పు చేస్తే.. కొడుకు అలా ఉండడు.. అనుకున్నామన్నారు. తప్పు దిద్దుకుంటారని చర్చలు జరిపామన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకోవాలన్నారు. 

ఇంకా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ నీటిని దోచుకుంటుంటే వైఎస్సార్ ను దొంగ అనక ఏమంటారు? ఇప్పుడు జగన్ కూడా అలాగే నీటిని దోచుకుపోతున్నారు. సయోధ్యతో ఉందామనుకుంటే.. నోట్లో చక్కెర, కడుపులో కత్తెర వైఖరితో ఏపీ నేతలున్నారు.

తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.  ఉద్యమంలో ఉన్నవారిమీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. పీజేఆర్ మృతికి వైఎస్సార్ కారణం కాదా? మా విగ్రహాలు ఏపీలో ఉండవు కానీ, మీ విగ్రహాలు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉన్నాయి. తెలంగాణ మొత్తం మీరే ఇచ్చినట్లు విగ్రహాలు పెట్టుకున్నారు. తెలంగాణ అధికారులను ఏపీలో ఇబ్బందులకు గురిచేశారు. నీటిమీద సీపీఐ నారాయణ స్పష్టమైన వైఖరి చెప్పాలి.. అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather