తెలంగాణవాదులొద్దు, ద్రోహులే ముద్దు.. కేసీఆర్ కొత్త సిద్ధాంతం: విజయశాంతి

By Siva KodatiFirst Published Aug 15, 2019, 5:27 PM IST
Highlights

తెలంగాణవాదులకు, ఉద్యమకారులకు కాలం చెల్లిందని.. తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకుల కాలం నడుస్తోందని ఆమె విమర్శించారు. మంత్రుల ద్వారా కేసీఆర్ చెప్పిస్తున్న టీఆర్ఎస్ కొత్త సిద్ధాంతం ఇదేనంటూ విజయశాంతి సెటైర్లు వేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత విజయశాంతి. ప్రస్తుతం తెలంగాణవాదులకు, ఉద్యమకారులకు కాలం చెల్లిందని.. తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకుల కాలం నడుస్తోందని ఆమె విమర్శించారు. మంత్రుల ద్వారా కేసీఆర్ చెప్పిస్తున్న టీఆర్ఎస్ కొత్త సిద్ధాంతం ఇదేనంటూ విజయశాంతి సెటైర్లు వేశారు.

కొద్దిరోజుల క్రితం ఆర్టికల్ 370 రద్దుకి టీఆర్ఎస్ మద్ధతు ప్రకటించడంతో కేసీఆర్‌పై రాములమ్మ మండిపడ్డారు. దేశ సార్వభౌమత్వంతోపాటు దేశ భద్రతకు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ..కేసీఆర్ నచ్చజెప్పి ఒప్పించి వుంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

కశ్మీర్ విభజన బిల్లుకు టీఆర్ఎస్ ఎందుకు మద్ధతు ఇచ్చిందో ఒవైసీకి వివరించి.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ పొత్తుకు ఇబ్బంది కలగకుండా కేసీఆర్ పావులు కదుపుతారని భావిస్తున్నామని వారు చెప్పారు.

ఎందుకంటే అవకాశానికి తగ్గట్లు తమ వైఖరిని ఎలాగైనా మార్చుకోగల సమర్ధత, ప్రజలను ఒప్పించగల చతురత కేసీఆర్ గారికి ఉన్నాయని పలు సందర్భాల్లో రుజువైంది. ఈ వ్యూహాలు ఎత్తులు ఎలా ఉన్నా..తెలంగాణ జనానికి ఇప్పటికే టీఆరెస్ అధినేత వైఖరిపై ఒక క్లారిటీ వచ్చి ఉంటుందంటూ విజయశాంతి సెటైర్లు వేశారు.

click me!