సీట్లపై ఇప్పటివరకు ఏ పార్టీతో చర్చించలేదు...ఏం చర్చించామంటే...: ఉత్తమ్ కుమార్ రెడ్డి

By Arun Kumar PFirst Published Sep 13, 2018, 2:49 PM IST
Highlights

తెలంగాణ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. అంతేకాదు వివిధ పార్టీల్లో సీట్లు రాని నాయకులు జంపింగ్ లకు సిద్దమయ్యారు. టికాంగ్రెస్ ఇంకా అభ్యర్థులనే ప్రకటించలేదు అప్పుడే అసమ్మతిని ఎదుర్కుంటోంది. మహాకూటమిలో భాగంగా తమ నియోజకవర్గ సీటును ఇతర పార్టీలకు కేటాయించనున్నారని ప్రచారం జరగడంతో చాలా మంది నాయకులు ఆందోళన చెందుతున్నారు. అంతే కాదు ఈ ప్రచారం నేపథ్యంలో కొందరు పార్టీని వీడటానికి కూడా సిద్దమవుతున్నారు. దీంతో టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ నష్టనివారణ చర్చలు చేపట్టారు.
 
ఇవాళ టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తాము ఇప్పటివరకు ఏ పార్టీతోనూ సీట్ల సర్దుబాటు కోసం చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. కేవలం టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వున్న పార్టీలను ఒక్కతాటిపైకి తేవడానికి మాత్రమే ప్రయత్నించామని అన్నారు.  తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం మాత్రమే మహాకూటమిగా ఏర్పడటానికి చర్చలు జరిపినట్లు ఉత్తమ్ తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఇప్పుడున్న సీపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఫించను విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం లోపే లక్షఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు, మరో లక్ష ఉద్యోగాలను ప్రైవేట్ రంగాల్లో సృష్టించనున్నట్లు ఉత్తమ్ హామీ ఇచ్చారు. 

click me!