కేసీఆర్‌, కేటీఆర్‌పై పోటీ చేసే అభ్యర్థులెవరో తెలుసా?

By narsimha lodeFirst Published Sep 13, 2018, 2:08 PM IST
Highlights

తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ పై  గద్దర్  పోటీ చేస్తారని టీ మాస్ ఫోరం ఛైర్మెన్ ప్రోఫెసర్ కంచ అయిలయ్య ప్రకటించారు. 

హైదరాబాద్:  తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ పై  గద్దర్  పోటీ చేస్తారని టీ మాస్ ఫోరం ఛైర్మెన్ ప్రోఫెసర్ కంచ అయిలయ్య ప్రకటించారు. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ పై  విమలక్క పోటీ చేస్తారని ఆయన తెలిపారు.

గురువారం నాడు ఆయన  హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గద్దర్, విమలక్ఖలు  ఎన్నో త్యాగాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో గద్దర్  పోరాటం చేసే సమయంలో అప్పటి సర్కార్ ఆయనపై  కాల్పులు జరిపిందన్నారు. ఇప్పటికీ ఆయన శరీరంలో ఓ తూటా ఉందన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో విమలక్క గజ్జెకట్టి  ఆడి పాడారని ఆయన ప్రస్తావించారు. కేసీఆర్, కేటీఆర్ లపై పోటీ చేస్తున్న గద్దర్, విమలక్కలను గెలిపించేందుకు  అన్ని పార్టీలు తమకు మద్దతివ్వాలని ఆయన కోరారు. తమ అభ్యర్థులకు వ్యతిరేకంగా  పోటీ చేయకూడదని ఆయన కోరారు. ఈ మేరకు ఆయా పార్టీలకు కూడ వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. 

ఈ వార్తలు చదవండి

70 ఏళ్లలో తొలిసారి ఓటు హక్కు: కేసీఆర్‌‌కు షాకిచ్చిన గద్దర్

ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది: గద్దర్, పార్టీలోకి ఆహ్వానిస్తాం: తమ్మినేని

click me!