సినీ హీరోగా మారిన కాంగ్రెస్ కీలక నేత.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా..

By SumaBala BukkaFirst Published Dec 25, 2021, 1:55 PM IST
Highlights

కాంగ్రెస్ పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్..  ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు సినీ హీరో గా మారనున్నారు.  బొమ్మకు మురళి అద్దంకి దయాకర్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అద్దంకితో పాటు ప్రజాయుద్ధ నౌక గద్దర్ కూడా కలిసి నటిస్తున్నారు. అద్దంకి భార్యగా ప్రముఖ సినీ నటి ఇంద్రజ నటిస్తున్నారు. 

హైదరాబాద్ : congress పార్టీలో ఆయన Fire brand గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు  Telangana Congress Partyలో ఉన్న కీలక నాయకులలో ఆయన ఒకరు. ఇప్పటివరకు నేరుగా ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన ఆ నాయకుడు ఇప్పుడు heroగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

తాజా సమాచారం ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత ఒకరు హీరోగా మారనున్నారు. ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో ఉండబోతున్నట్టుగా సమాచారం.  ఫిబ్రవరిలో ఆయన నటించిన సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరంటే..

కాంగ్రెస్ పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్..  ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు సినీ హీరో గా మారనున్నారు.  బొమ్మకు మురళి అద్దంకి దయాకర్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అద్దంకితో పాటు ప్రజాయుద్ధ నౌక గద్దర్ కూడా కలిసి నటిస్తున్నారు. అద్దంకి భార్యగా ప్రముఖ సినీ నటి ఇంద్రజ నటిస్తున్నారు. మరో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది.

వ్య‌వ‌సాయ‌ మార్కెట్లను నిర్వీర్యం చేసింది.. కేంద్రంపై మంత్రి హరీష్ రావు విమర్శలు

ఈ సినిమాకు మేరా భారత్, జై భారత్ అనే పేర్లను పరిశీలిస్తున్నారని అద్దంకి తెలిపారు. బయోవార్, దేశ సమస్యలు, సామాజిక అంశాలు ఈ సినిమాలో ఉంటాయని అద్దంకి దయాకర్ వివరించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. 

అయితే దీనిమీద అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా తన సెమీ బయోపిక్ గా ఉంటుందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే అన్ని కమర్షియల్ సినిమాల్లో లాగే ఇందులోనూ కొన్ని ఫైట్లు ఉంటాయని, ఓ పాట కూడా ఉంటుందని తెలిపారు. 

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా న్యూ ఇయర్ వేడుకలు.. డ్రగ్స్‌ కట్టడికి కఠిన చర్యలు.. సీవీ ఆనంద్

యంగ్ పొలిటీషన్ గా ఎదుగుతున్న క్రమంలో తాను ఎలాంటి ఛాలెంజ్ లను ఎదుర్కొన్నాడన్న విషయాలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను గాంధీ భవన్ లో చిత్రీకరించారు. దీనికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతల అనుమతి కూడా తీసుకున్నామని తెలిపారు. సినిమాలోని సన్నివేశంలో బాగంగా అద్దంకి దయాకర్ ప్రెస్ తో మాట్లాడే సీన్ లను గాంధీ భవన్ లో షూట్ చేశారు. 

click me!