షర్మిలతో టచ్‌లోనే హైకమాండ్ .. కాంగ్రెస్‌లో చేరితే ఏపీకే : మాణిక్‌రావు థాక్రే సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jun 23, 2023, 06:54 PM IST
షర్మిలతో టచ్‌లోనే హైకమాండ్ .. కాంగ్రెస్‌లో చేరితే ఏపీకే : మాణిక్‌రావు థాక్రే సంచలన వ్యాఖ్యలు

సారాంశం

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే . ఆమెతో హైకమాండ్ టచ్‌లోనే వుందని, షర్మిల వస్తే ఏపీ కాంగ్రెస్‌కు బలమని థాక్రే వ్యాఖ్యానించారు.   

కర్ణాటక ఎన్నికల్లో విజయం ఇచ్చిన జోష్‌తో తెలంగాణ కాంగ్రెస్‌లో నూతనోత్తేజం నెలకొంది. దీనికి తోడు రేవంత్ రెడ్డి వ్యూహాలు, భట్టి పాదయాత్ర పార్టీకి అపు బలాన్ని తీసుకొచ్చింది. అలాగే నేతలు తాము విభేదాలకు దూరంగా వుంటామని చెప్పడం కూడా సానుకూల పరిణామాం. త్వరలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకోనుండగా.. రానున్న రోజుల్లో బీఆర్ఎస్, బీజేపీల నుంచి కూడా నేతలు హస్తం గూటికి చేరనున్నారు.

ఇదిలావుండగా తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ పార్టీ పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని.. లేదు లేదు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. కేపీసీసీ చీఫ్ , కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పలు మార్లు షర్మిల భేటీ కావడంతో కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఆమె రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినా.. దీని వెనుక మర్మం పార్టీ విలీనమే అనే గుసగుసలు వినిపించాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలూ ఈ వదంతులపై స్పందించి వైఎస్సార్టీపీ విలీనానికి వ్యతిరేకంగా మాట్లాడారు. 

ALso Read: కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై షర్మిలా రియాక్షన్ ఇదే.. ఆమె ఏమన్నారంటే?

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలతో హైకమాండ్ టచ్‌లో వుందన్నారు. షర్మిల వస్తే ఏపీ కాంగ్రెస్‌కు ఎంతో లాభమని థాక్రే వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. రెండు దశల్లో అభ్యర్ధుల జాబితాను వెల్లడిస్తామని.. బీఆర్ఎస్, బీజేపీల నుంచి రానున్న కాలంలో కాంగ్రెస్‌లోకి చేరికలుంటాయని మాణిక్‌రావు థాక్రే పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క గట్టిగా పోరాడుతున్నారని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా భట్టి విక్రమార్క పాదయాత్ర పార్టీకి చాలా దోహదం చేస్తోందన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిల స్పందించారు. తన చివరి శ్వాస వరు తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటారని ఆమె పేర్కొన్నారు. అంతేకానీ, ఊహాజనిత కథనలు కల్పిస్తూ, ఆమెకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించే విఫల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాదు, పని లేని, పస లేని దార్శనికులు అని పేర్కొంటూ.. తన రాజకీయ భవిష్యత్ మీద దృష్టి పెట్టే బదులు.. కేసీఆర్ పాలనలో నాశనమైపోతున్న తెలంగాణ భవిత మీద దృష్టి పెట్టాలని సూచించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని ఎండగట్టాలని పేర్కొన్నారు. తన భవిష్యత్ తెలంగాణతోనే అని, తన ఆరాటం, తన పోరాటం తెలంగాణ కోసమే అని.. జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ